ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ వీళ్లే..!?

Anilkumar
బుల్లితెర టాప్ షో లలో ఒకటిగా కొనసాగుతున్న బిగ్ బాస్ షో క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటివరకు తెలుగులో ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో. ఇక గత ఏడాది సీజన్ సెవెన్ తో భారీ సక్సెస్ అయిన బిగ్ బాస్ షో ఈసారి సీజన్ 8 కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. యాంకర్స్ సీరియల్ యాక్టర్స్ సోషల్ మీడియా స్టార్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫేమస్ అయిన వాళ్ళందరినీ చాలావరకు ఈసారి బిగ్ బాస్ షోలో తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం వినబడుతోంది. ఇక సీజన్ సెవెన్ ఎంత పెద్ద

 హిట్ టాక్ తెచ్చుకుందో సీజన్ 8 కూడా అదే స్థాయిలో సక్సెస్ చేయాలి అని నానా విధాలుగా ప్రయత్నిస్తున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు కంటెస్టెంట్స్ ను ఫిక్స్ చేసే పనిలో మేకర్స్ బిజీగా ఉన్నారు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు బిగ్బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇచ్చేవారు ఎవరు అని  పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే షో స్టార్ట్ అయ్యే వరకు ఇందులో కంటెస్టెంట్స్ గా ఎవరు వస్తున్నారు అన్న విషయాన్ని ఎక్కడా లీక్ చేయకూడదు అని అన్ని విధాలుగా జాగ్రత్త

 వహిస్తున్నట్లుగా సమాచారం వినబడుతోంది.  కానీ కొంతమంది యూట్యూబ్ కంటెస్టెంట్ లిస్ట్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు గతంలో ఈ షోకి వచ్చిన వారిలో కొందరిని మళ్లీ తీసుకురాబోతున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీళ్లే సీజన్ 8 లోకి కంటెస్ట్ట్స్ గా రాబోతున్నారు అంటూ కొందరి పేర్లను సోషల్ మీడియాలో లీక్ చేసారు. మరి వారు ఎవరు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
అంజలి పవన్.. యాంకర్..
వింధ్య విశాక.. యాంకర్..
నయని పావని.. యూట్యూబర్..
కిర్రాక్ ఆర్పీ.. జబర్దస్త్ కమెడియన్..
రీతూ చౌదరి.. యాంకర్..
అమృతా ప్రణయ్..
నిఖిల్.. యాంకర్..
కుమారీ ఆంటీ..
బర్రెలక్క..
అనీల్ గీలా.. యూట్యూబర్..
బుల్లెట్ భాస్కర్.. జబర్దస్త్ కమెడియన్..
సోనియా సింగ్.. సినీనటి.
బమ్ చిక్ బబ్లూ.. యూట్యూబర్..
కుషితా కల్లపు.. హీరోయిన్..
వంశీ.. యూట్యూబర్..
సుప్రిత.. సురేఖ వాణి కూతురు..
ప్రస్తుతం వీరితోపాటు మరికొందరి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అలాగే ఇందులో కొన్ని కారణాలతో ఎవరైనా ఆగిపోవచ్చు. లేదా మరికొందరు హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం లేకపోలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: