రేవంత్ కు మరో అగ్ని పరీక్ష..?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు  ఇప్పుడు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల హడావిడి  స్పష్టంగా కనిపించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత...  ఖమ్మం, వరంగల్ అలాగే నల్గొండ  ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ  ఉప ఎన్నిక జరిగింది. దీంతో ఈ ఎన్నిక అయిపోయే వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు లోనే ఉండటం మనం చూసాం.

 
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ... గులాబీ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  గట్టి పోటీ ఇచ్చిందని చెప్పవచ్చు. తీన్మార్ మల్లన్న పార్టీ అభ్యర్థి కావడంతో... కాంగ్రెస్కు ఓటు వేసే వారు కూడా... గులాబీ పార్టీకి వేశారని సమాచారం. నిరుద్యోగులను తీన్మార్ మల్లన్న... మోసం చేశాడని... పట్టభద్రులు రగిలిపోతున్నారు. దీంతో గులాబీ పార్టీ అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డికి మంచి.. సపోర్ట్ వచ్చిందట.

 
 అయితే ఈ ఎన్నిక పూర్తికాగానే ఇప్పుడు...  మున్సిపాలిటీల చైర్ పర్సన్ అలాగే వైస్ చైర్ పర్సన్  ఎన్నిక కూడా తెర పైకి వచ్చింది. కొల్లాపూర్, కామారెడ్డి అలాగే నార్సింగి మున్సిపాలిటీలలో... వైస్ చైర్మన్ అలాగే చైర్మన్ పదవులకు ఎన్నిక జరగాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్న నేపద్యంలో... ఈ మూడు మున్సిపాలిటీలను ఒక కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం గ్యారెంటీ అంటున్నారు. ఎందుకంటే గతంలో గులాబీ పార్టీ కూడా... అధికారంలో ఉంది కాబట్టి అన్ని మునిసిపాలిటీలను కైవసం చేసుకుంది.

 
 ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది. అయితే ఈ ఎన్నికల తర్వాత... తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ గనుక... గెలవకపోతే... ఆ ప్రభుత్వానికి పెద్ద సమస్యలు వస్తాయి. కాబట్టి... నాయకులను కొని అయినా సరే... గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలవాలని ఇప్పటినుంచే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గ్రామస్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే... మరోసారి అధికారంలోకి రావడం, ఇప్పుడున్న అధికారాన్ని కొనసాగించుకోవచ్చు. లేకపోతే భవిష్యత్తులో అనేక సమస్యలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. వాటిని అధిగమించేందుకు... ఇతర పార్టీల నుంచి నాయకులను రేవంత్ రెడ్డి తీసుకునేందుకు... ప్రయత్నం చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: