తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ అయిన మహేష్ బాబు..!

Anilkumar
దిగవంత నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలను ఛాలెంజింగ్ పాత్రను చేసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అప్పట్లో ఎన్నో సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసారు. అంతేకాదు హీరోగా నిర్మాతగా దర్శకుడుగా కూడా చెరగని ముద్ర సంపాదించుకున్నారు ఆయన. అయితే ఈరోజు ఆయన జయంతి. ఇక ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు సినీ ప్రముఖులు అందరూ కూడా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు

 చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేష్ బాబు తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్  పోస్ట్  చేశాడు. దీంతో ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 'హ్యాపీ బర్త్ డే నాన్న… మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నాము. నా ప్రతి జ్ఞాపకంలో మీరు ఎప్పటికీ జీవించే ఉంటారు.' అంటూ ఎమోషనల్  పోస్ట్  చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు చేసిన పోస్ట్  నెట్టింట వైరలవుతుంది. సూపర్ స్టార్ కృష్ణ.. 1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెం ప్రాంతంలో

 ఘట్టమనేని రాఘవయ్య, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు. కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. పై ఇష్టం.. నటనపై ఆసక్తితో చదువులు పూర్తయ్యాక చెన్నైకు వెళ్లి ల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1965లో తేనెమనసులు తో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. తొలి తోనే నటుడిగా సక్సెస్ అయిన కృష్ణ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. ఐదు దశాబ్దాల కెరీర్ లో దాదాపు 350కి పైగా ల్లో నటించారు.  ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో ఒక సినిమా చేయబోతున్నాడు మహేష్ బాబు .ఇప్పటివరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ సినిమాకి సంబంధించిన  పనులతో మహేష్ బాబు బిజిగా గా ఉన్నట్టుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: