ఏపీలో క్వారంటైన్ కేంద్రం నుంచి కరోనా రోగులు పరార్... టెన్షన్ లో అధికారులు...?

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నిన్న 25 కొత్త కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 2230కు చేరగా 50 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో కడప జిల్లా కాశీనాయన మండలం నరసాపురం క్వారంటైన్ సెంట‌ర్ నుంచి కరోనా పాజిటివ్ రోగులు పరారయ్యారు, 
 
క్వారంటైన్ కేంద్రం దగ్గర అధికారులు ఎవ్వరూ లేకపోవడంతో కరోనా బాధితులు క్వారంటైన్ కేంద్రం నుంచి పారిపోయారు. 15 మంది కరోనా బాధితులు పారిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనతో అధికారులు టెన్షన్ పడుతున్నారు. పారిపోయిన కరోనా రోగుల గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కరోనా రోగులు పరారైనట్టు వార్త రావడంతో నరసాపురం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: