బిఆర్ఎస్ పోతే : కారు షెడ్డుకి.. కేసీఆర్ ఫామ్ హౌస్ కి.. జరిగేదిదేనా?

praveen
ఉద్యమాల పార్టీగా పిలుచుకునే బిఆర్ఎస్ కు ప్రస్తుతం ఊపిరాడట్లేదా? ఏ తెలంగాణ ప్రజల కోసం అయితే కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించారో.. ఇక ఆ తెలంగాణ ప్రజలే ఇప్పుడు కేసీఆర్ ను నమ్మడం లేదా? కారు బ్రేకులు ఫెయిల్ అయి చివరికి షెడ్డు కు వెళ్లే పరిస్థితి వచ్చిందా అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవును అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ తిరుగులేని పార్టీగా అవతరించింది.

 వరుసగా రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక తెలంగాణలో గులాబీ పార్టీని ఎదుర్కొనే మరో పార్టీ లేదు అనే స్థాయికి ఎదిగింది. అయితే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ను కూడా నామరూపాలు లేకుండా చేయాలని అనుకుంది. దాదాపుగా తెలంగాణలో కాంగ్రెస్ చాప్టర్ క్లోజ్ అనే పరిస్థితి కూడా తీసుకువచ్చింది. కానీ ఆ తర్వాత రేవంత్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టారో అప్పటినుంచి కాంగ్రెస్ పుంజుకుంది. అయితే కాంగ్రెస్ పుంజుకుంటూ వచ్చిన బలమైన ప్రతిపక్షంగా ఉంటుంది అనుకున్నారు తప్ప.. ఇక తిరుగులేని పార్టీగా ఉన్న బిఆర్ఎస్ను ఓడిస్తుందని ఎవరూ ఊహించలేదు.

 కానీ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. ఇక కెసిఆర్ సార్ ను కాదని అటు కాంగ్రెస్కు పట్టం కట్టారు. ఇంకేముంది కారు పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిందో లేదో ఆ పార్టీలోని కీలక నేతలందరూ ఇక కారు దిగి చేయి అందుకున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక ఉన్న నేతలనైనా కాపాడుకోవాలి అంటే తప్పనిసరిగా పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాల్సిన పరిస్థితి బిఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసుకుంటే 17 పార్లమెంట్ స్థానాలకు గాను బిఆర్ఎస్ అతికష్టం మీద ఒక సీట్ గెలుస్తుందని లేదంటే ఒక్క సీటు కూడా దక్కబోదు అనే విషయాన్ని తేల్చి చెప్పాయి అన్ని సర్వేలు. ఒకవేళ ఫలితాలలో ఇదే జరిగితే గనక.. బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుంది. ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా బిజెపి లేదా హస్తం పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే బ్రేకులు ఫెయిల్ అయిన కారు షెడ్డు కు వెళ్లడం ఖాయమని.  ఇక ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అవుతారని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: