మరో తెలుగు మూవీ లో ఛాన్స్ కొట్టేసిన జాన్వి... ఈసారి ఆ స్టార్ హీరోతో..?

MADDIBOINA AJAY KUMAR
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా , ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఇకపోతే ఇప్పటికే రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించాడు. అందులో భాగంగా మహేష్ కు జోడిగా ఓ బ్యూటీ నీ హీరోయిన్ గా తీసుకోవాలి అని రాజమౌళి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఆమె ఎవరో కాదు జాన్వి కపూర్. ఇప్పటికే రాజమౌళి , మహేష్ కి ఈ మూవీ లో జోడిగా జాన్వి అయితే బాగుంటుంది అని ఆలోచనకు వచ్చినట్లు , అందులో భాగంగా ఈమెను మరికొన్ని రోజుల్లోనే సంప్రదించి , ఈ సినిమా మొత్తం కథను అందులోని తన పాత్రను వివరించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నిజంగానే రాజమౌళి కనుక జాహ్న  నీ మహేష్ మూవీ లో హీరోయిన్ గా అనుకున్నట్లు అయితే దాదాపుగా ఈ బ్యూటీ కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇకపోతే ప్రస్తుతం జాహ్న కపూర్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మొదటి భాగాన్ని అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే రామ్ చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో కూడా జాన్వి హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఒక టాలీవుడ్ క్రేజీ మూవీ లో నటిస్తూ మరో క్రేజీ సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్న ఈ బ్యూటీ మరో క్రేజీ సినిమాలో అవకాశం దక్కించుకునే ఛాన్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: