ఏపీ: కాబోయే సీఎం అతడే.. తేల్చేసిన మాజీ మంత్రి రావెల..!

Divya
జూన్ 4వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి.అసెంబ్లీ ,పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఫలితాల పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఏ పార్టీ అధికారం దక్కించుకుంటుందనే విషయం తెలియక సతమతమవుతున్నారు.నిన్నటి రోజున ఎగ్జిట్ పోల్స్ కూడా ఏపీ ప్రజలను తికమక పట్టించేలానే ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే మాజీ మంత్రి వైసిపి నేత రావుల కిషోర్ పలు రకాల ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. నిన్నటి రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 70 శాతం మంది ప్రజలు వైసిపి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.

జగన్ మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు చాలా బలంగా అనుకుంటున్నారని ఏపీలో స్పష్టమైన ఫలితాలు రాబోతున్నాయని తెలిపారు. రెండవసారి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని ఈ దిమాను ఎవరు ఆపలేరని కూడా తెలియజేశారు.. ఎన్నికలలో ప్రజాతీర్పును టిడిపి గౌరవించాలని తెలియజేశారు మాజీ మంత్రి రావెల కిషోర్. ఇదంతా ఇలా ఉండగా గెలుపు పై ఎన్డీఏ కూటమిలో టిడిపి జనసేన ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం వైసిపి మరొకసారి గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కూడా తెలియజేశారు.

మరి జగన్ చంద్రబాబు ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారని విషయం పైన కూడా సందిగ్ధతతో ఉన్నప్పటికీ ఇరువురు పార్టీ నేతలు కూడా ప్రమాణ స్వీకార తేదీని కూడా అనౌన్స్మెంట్ చేస్తూ మరింత ఉత్కంఠతను  పెంచుతున్నారు. మరి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎవరు సీఎం అవుతారని విషయం తెలియాలి అంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ సైతం తెలియజేసినప్పటికీ ఇంకా నేతలలో కాస్త ఆందోళన కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చాలామంది నేతలు కూడా ఎవరు గెలుస్తారో తెలియక సతమతమవుతున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరిని సీఎంగా కోరుకున్నారనే విషయం త్వరలోనే తెలియబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: