బన్నీ డ్యాన్స్ కి షాహిద్ ఫిదా...
మన తెలుగులో అల్లు అర్జున్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను డాన్స్ చేస్తుంటే చాలు చాలా మంది అలా చూస్తూ ఉంటారు. సంక్రాంతి కానుకగా విడుదల అయిన అల వైకుంఠపురములో సినిమాలో అతని డాన్స్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. బుట్టా బొమ్మా, రాములో రాములా అనే పాటల్లో అతని డాన్స్ చూసి బాలీవుడ్ కూడా ఫిదా అయిపోయింది.
ఇక అతని డాన్స్ కి షాహిద్ కపూర్ కూడా ఫిదా అయిపోయాడు. ఈ బాలీవుడ్ హీరో తాజాగా ట్విట్టర్ లో ఒక సంభాషణ లో భాగంగా అల్లు అర్జున్ డాన్స్ గురించి ఏదైనా చెప్పండి అని ప్రశ్నించగా “తన డ్యాన్స్ స్కిల్స్ ను ఇష్టపడండి” అని రాశాడు. హీరోయిన్ దిశా పటాని కూడా అతని డాన్స్ ని అభినందించింది.
Love his dancing skills. https://t.co/3D3FdlEwPa — shahid kapoor (@shahidkapoor) May 12, 2020