ఒక్కపూట భోజనం లేక.. మోహన్‌బాబు ఎమోషనల్ ట్వీట్!
హీరో మోహన్‌బాబు.. హీరోల్లో ఎంతో ప్రత్యేకం.. నటనలో.. డైలాగ్ డెలివరీలో.. ఆయనది ప్రత్యేకమైన పంథా..! ఎన్నో మరుపురాని.. మరవలేని చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్రవేశారు. ఆ తరం నుంచి ఈ తరం దాకా.. అభిమానులను సంపాదించుకున్న అరుదైన నటుల్లో మోహన్‌బాబు ఒకరు. ఎన్నో కష్టాలకు ఓర్చి చిత్రసీమలో అడుగుపెట్టారు. తినేందుకు తిండిలేక.. పడుకునేందుకు కొద్దిపాటి చోటుకూడా లేక అనేక ఇబ్బందులు పడ్డారు. అయినా పట్టువదలకుండా ప్రయత్నం చేశారు. తాను అనుకున్నది సాధించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా..? ఈ రోజు మోహన్‌బాబు ఒక ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేశారు. కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు.
ఈ క్రమంలో మోహన్‌బాబు కూడా తనవంతు సాయం అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వీడియోను పోస్ట్ చేశారు. * నేను నటుడిగా మద్రాసులో ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో ఒక్క పూట భోజనం లేక ఎన్నో రోజులు గడిపాను. అప్పుడు ప్లేట్ మీల్చ్ 80పైసలు. అంటే ఆ పైసలు కూడా లేవు. అప్పుడు భగవంతుడిని ప్రార్థించాను.. దేవుడా.. నన్ను మంచి నటుడిని చేయి.. ఆ వచ్చిన డబ్బులు.. పది మందికి భోజనం పెట్టే అవకాశం కల్పించు.. ఆయన ఇచ్చాడు.. ఈరోజున పదిమందికి భోజనం పెడుతున్నా..అంటే నేను గొప్పవాడిని కాదు.. అవకాశం ఉన్నవాళ్లు.. ఆకలిలతో ఉన్నవాళ్లకు ఒక్కపూట భోజనం పెడితే..మీకంటే గొప్పవాళ్లు ఎవరూలేరు.. అదే మీకు శ్రీరామ రక్ష* అని ఆ వీడియోలో చెప్పారు.
🙏🙏🙏 https://t.co/0ZPYVKAztb — BANDLA GANESH (@ganeshbandla) May 3, 2020