ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం.. 34 లక్షలు దాటిన కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. దేశాలన్నీ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అంతకంతకూ వైరస్ విస్తరిస్తూనే ఉం ది. ఇవాళ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 34 లక్షలు దాటింది. ముఖ్యంగా కొవిడ్-19 అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఇక్కడ మొత్తం కేసుల సం ఖ్య 11, 12, 341కు చేరింది. కరోనా బారిపడి దేశవ్యాప్తంగా 64, 914 మంది చనిపోయారు. ఇక రష్యా, బ్రెజిల్లో వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు కొత్తగా 2529 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 3,401,002లక్షలుగా ఉంది. ఈరోజు కరోనా బారినపడి 154 మంది మరణించగా, ఇప్పటి వరకు మొత్తం 2,39,602 లక్షల మంది మృత్యువాతపడ్డారు. ఈసంఖ్య పెరిగే అవకాశం ఉంది.