హెరాల్డ్ బర్త్ డే : 10-08-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen
ఆగస్టు 10వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే  ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి. మరి ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి.



 లక్ష్మీపార్వతి జననం : సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య గా ఎంతగానో సుపరిచితురాలైన లక్ష్మీపార్వతి 1962 ఆగస్టు 10వ తేదీన జన్మించారు. తెలుగు రచయిత తెలుగుదేశం పార్టీ, సీనియర్ ఎన్టీఆర్ అభిమానురాలు అయిన లక్ష్మీ పార్వతి తన భర్త సుబ్బారావుతో కలిసి 1985లో ఎన్టీ రామారావు జీవిత చరిత్ర రాసే  ఉద్దేశంతో కలిసింది, ఎన్టీ రామారావు జీవిత చరిత్రను రాసే క్రమంలో ఆయనకు దగ్గరైంది  లక్ష్మీపార్వతి. తర్వాత 1993 లో ఎన్టీ రామారావు ని  పెళ్లి చేసుకుంది. 1996లో పాతపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన లక్ష్మి పార్వతి గెలుపొందింది. ఆ తర్వాత రెండు సార్లు పోటీ చేసినప్పటికీ ఓటమిపాలైంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా కొన సాగుతున్నారు లక్ష్మీపార్వతి.



 వి వి గిరి జననం : భారత దేశ నాలుగవ రాష్ట్రపతి అయిన వి.వి.గిరి 1894 ఆగస్టు 10వ తేదీన జన్మించారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈయన... యూనివర్సిటీ కళాశాల డబ్లిన్ లో  న్యాయశాస్త్రం అభ్యసించారు. భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత క్రియాశీలక కార్మిక ఉద్యమంలో పాల్గొని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా,  తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అఖిల భారత ట్రేడ్ కాంగ్రెస్ కు  అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఈయన భారత దేశానికి నాలుగవ రాష్ట్రపతిగా కూడా పనిచేశారు.



 శంకరంబాడి సుందరాచారి జననం : ప్రముఖ తెలుగు రచయిత తెలుగు రాష్ట్రాలకు రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లి కి మల్లెపువ్వు  దండ అనే గీతాన్ని అందించిన వ్యక్తి శంకరంబాడి సుందరాచారి 1914 ఆగష్టు 10 వ తేదీన జన్మించారు. చిన్నతనం నుంచి స్వతంత్ర భావాలు కలిగి ఉండేవారు సుందరాచారి. ఇక ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన సుందరాచారి భుక్తి కోసం ఎన్నో పనులు చేశారు. తనలోని రచయిత బయటికి తీసుకొచ్చి ఎన్నో రచనలు రచించి ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆయన అందించిన మా తెలుగు తల్లి అనే గీతం తెలుగు రాష్ట్రాలకు రాష్ట్ర  గీతంగా ఎన్నుకోబడింది.



 కొండ వలస లక్ష్మణ రావు జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సుప్రసిద్ధ నటుడు.. మొదటి నాటకరంగంలో లబ్దప్రతిష్టులు.. అయిన  కొండ వలస లక్ష్మణ రావు 1946 ఆగస్టు 10వ తేదీన జన్మించారు. డైరెక్టర్ వంశీ ఔను  వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఆ తర్వాత తన హావభావాలతో కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కొండవలస లక్ష్మణరావు ప్రతి సినిమాలో కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇప్పటివరకు దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమలో రెండు వందల సినిమాలకు పైగా నటించారు కొండవలస లక్ష్మణరావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: