"చుండ్రు".. పోగొట్టే సింపుల్ చిట్కాలు...ఎంతమందికి ఇవి తెలుసు..!!!

NCR

చుండ్రు సమస్య ప్రతి ఒక్కరినీ  వేధిస్తూనే ఉంటుంది. ఎంతో ఒత్తయిన జుట్టు, నల్లగా నిగనిగలాడే ఉంగరాల జుట్టు ఉన్నా సరే చుండ్రు సమస్య ఉంటే ఆ జుట్టు ఎంతో నిర్జీవంగా మారుతుంది. అంతేకాదు మెల్ల మెల్లగా జుట్టు ఊడిపోవటం మొదలవుతుంది. అయితే మార్కెట్లో  ఎన్నో ఉత్పత్తులు చుండ్రు నివారణకి  దొరుకుతున్నా సహజసిద్ధ పద్ధతుల ముందు అవన్నీ దిగదుడుపే.

 

పూర్వీకులు అనుసరించిన పద్ధతులను గనుకా పాటిస్తే చుండ్రు పోవడమే కాకుండా జుట్టుకు ఎంతో రక్షణ కూడా ఇస్తుంది. రసాయనిక ఉత్పత్తుల లాగా ఎటువంటి  సైడ్ ఎఫెక్ట్స్  లేకుండా జుట్టు మరింత ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మరి సహజసిద్ధంగా చుండ్రుని పోగొట్టే ఆ చిట్కాలు ఇప్పుడు చూద్దాం.


కుంకుడు కాయలు అందరికీ తెలిసినవే ఇప్పుడు మార్కెట్లో కుంకుడుకాయ పౌడర్ అందుబాటులో ఉన్నా కుంకుండు కాయలు తీసుకుని కాయలతో రసం చేసుకుని తల స్నానం చేయడం ఎంతో ఉత్తమం. ఇవి  చుండ్రును నివారించడంలో మెరుగైన ఫలితాలను ఇస్తాయి. 

మీరు నిత్యం వాడే కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి కుదుళ్లకు బాగా పట్టేలా మర్దన చేసుకోవాలి. ఇలాచేసిన తర్వాత సుమారు గంట పాటు  తలని ఆరనిచ్చి , తరువాత కుంకుడు కాయ రసంతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు.

గసగసాలను మెత్తటి పేస్టులా చేసుకుని తలకు పట్టించి, గంట తర్వాత కుంకుడు కాయ లేదా సీకాయతో స్నానం చేసినా సులభంగా పోగొట్టవచ్చు

పారిజాత చెట్టు నుంచీ గింజలు సేకరించి.  వాటిని మెత్తగా నూరి, ఆ మిశ్రమాన్ని స్వచ్ఛమైన నూనెలో కలిపి తలకు పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత గంట పాటు ఆరనిచ్చి కుంకుడు కాయతో తలస్నానం చేస్తే చుండ్రు నివారించవచ్చు

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: