"అవాంచిత రోమాలు"...తొలగించే అద్భుతమైన చిట్కా...!!!!

NCR

చాలా మంది మహిళలు ఎదుర్కునే సమస్య పెదవి పై భాగంలో మీసాలు రావడం. స్త్రీ లలో ఈ రకమైన పరిస్థితులని ఎదుర్కునే వారు బయటకి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. ఈ రోమాలని తొలగించుకోవడానికి అనేక రకాలుగా అసహజ పద్దతులని, షేవింగ్ వంటి ఆధునిక పద్దతులని అవలంబిస్తూ ఉంటారు. దాంతో చర్మం పై రాషెస్ వచ్చి పెదాలు బండబారినట్టుగా మారుతాయి. దాంతో అందమైన పెదాలు వికృతంగా మారిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే సహజ పద్దతులని ఉపయోగించి ముఖంపై, పెదవి పై భాగంలో వచ్చే రోమాలని తొలగించుకోవచ్చు.

 

వంటింట్లో మనకి అందుబాటులో ఉండే పంచదార, తేనె ,నిమ్మ లతో మనం అవాంచిత రోమాలని నయం చేయవచ్చు. అదెలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

 

ముందుగా మూడు స్పూన్స్ పంచదార తీసుకోవాలి, దానితో పాటు ఒక స్పూన్ తేనే, ఒక స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. ఆ తరువాత ఒక గిన్నెలో పంచదార వేసుకుని, దానికి తేనే , నిమ్మరసం కలిపి ఓ మిశ్రమంగా చేయండి. ఆ మిశ్రమాన్ని అవాంచిత రోమాలు ఉన్న పై పెదవి ప్రాంతంలో ఒక పొరలా అద్దండి. ఆ తరువాత ఒక పావుగంట పాటు ఆరనిచ్చి, గోరు వెచ్చని నీటితో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా తప్పకుండా మంచి ఫలితాన్ని పొందవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: