బాబోయ్‌.. ఏపీలో ఇందరు లంచగొండులా?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్‌లో లంచాల నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా 14400 సర్వీసును యాప్ ద్వారా కూడా తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆఫీసుల్లో ఎవరైనా లంచం అడిగితే.. 2109 నవంబర్ లో 14400 సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇటీవల 2022 జూన్ లో 14400 యాప్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు.

అయితే.. ఈ కాల్ సర్వీసు అందుబాటులోకి తెచ్చాక.. ఇప్పటికి లక్షల మంది కాల్ చేసి ఫిర్యాదులు చేశారు. ఆ లిస్ట్ ఎంత పెద్దగా ఉందంటే.. 2019లో 5114 మంది కాల్స్ చేసి ఫిర్యాదు చేశారట. ఆ తర్వాత 2020లో 67,427  మంది కాల్స్ చేసి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత 2021లో 45 వేల990  మంది కాల్స్ చేసి ఫిర్యాదు చేశారు. అలాగే 2022లో ఇప్పటి వరకూ 31 వేల419   మంది కాల్స్ చేసి ఫిర్యాదు చేశారట. అంతే కాదు కొత్తగా తీసుకొచ్చిన మొబైల్ యాప్ ద్వారా 1925 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. మొత్తం కాల్స్ లో  8వేల 842 అవినీతి నిరోధక అంశాలపై ఫిర్యాదులు వస్తే.. మిలిగిన  90వేల 715 మాత్రం ఇతర కాల్స్ గా అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: