హారియర్ & సఫారి: రెడ్ డార్క్ ఎడిషన్స్ లాంచ్?

Purushottham Vinay
హారియర్ & సఫారి: రెడ్ డార్క్ ఎడిషన్స్ లాంచ్?

ఆటో ఎక్స్‌పో 2023 లో ఇండియన్ ఫేమస్ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ తన హారియర్ రెడ్ డార్క్ ఎడిషన్ ఇంకా సఫారి రెడ్ డార్క్ ఎడిషన్‌ వంటి కార్లని లాంచ్ చేసింది.ఇక కంపెనీ  ఇందులో డార్క్ ఎడిషన్‌ను కలిగి ఉంది, అయితే ఇప్పుడు లాంచ్ చేసిన ఎడిషన్స్ అక్కడక్కడా రెడ్ కలర్ పొందుతాయి.టాటా మోటార్స్ లాంచ్ చేసిన ఈ అప్డేటెడ్ రెడ్ డార్క్ ఎడిషన్స్ మెరుగైన టచ్‌స్క్రీన్ ఇంకా ADAS టెక్నాలజీ వంటి వాటిని పొందుతాయి. అయితే కంపెనీ ఈ సంవత్సరం చివరినాటికి హారియర్ ఇంకా సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్‌లను విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో  టాటా  ఫ్లాగ్‌షిప్ SUVలలో ADAS టెక్నాలజీ ఉంది. ఈ టెక్నాలజీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.


హారియర్ ఇంకా సఫారి రెడ్ డార్క్ ఎడిషన్‌లలోని ADAS టెక్నాలజీలో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB), ఫార్వర్డ్ కొలిషన్ అలర్ట్, లేన్ అసిస్ట్ ఇంకా అలాగే ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ వంటివి కూడా ఉన్నాయి. ఈ రెండూ కూడా ఇప్పుడు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో రానున్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల సేఫ్టీని నిర్థారిస్తాయి. డిజైన్ పరంగా ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఇంకా చూడగానే ఆకర్శించే విధంగా ఉంటాయి.టాటా హారియర్, సఫారి రెడ్ డార్క్ ఎడిషన్‌లు, డార్క్ ఎడిషన్ లాగా కొంత డిఫరెంట్ గా చాలావరకు ఆల్-బ్లాక్ ఎక్స్‌టీరియర్‌ కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ 'ఒబెరాన్ బ్లాక్' అని పిలుస్తుంది.అయితే అక్కడక్కడా రెడ్ కలర్ ఉంటుంది. ఇది ప్రధానంగా బ్రేక్ కాలిపర్‌లలో మనం చూడవచ్చు. ఇక్కడ 18 ఇంచెస్ వీల్స్ కూడా ఉన్నాయి. ఇంకా అంతే కాకుండా ఈ ఎడిషన్ ముందు భాగంలోని గ్రిల్ మీద కూడా రెడ్ కలర్ ని చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: