మహిళల స్వేచ్ఛను కాపాడండి...

VAMSI
ఈ ప్రపంచంలో మహిళ అనే పదానికి మరియు ఆ స్థానానికి ఎంతో విలువ ఉంది. ఈ రోజు మహిళ అనేక చోట్ల తన ఉనికిని ఘనంగా చాటుకుంటోంది. ఇంట్లో ఒక తల్లిగా, ఒక చెల్లిగా, కూతురిగా, భార్యగా ఇలా ఎన్నో బంధాలలో మిళితమై అందరికీ తన సేవల్ని అందిస్తూ ఉంది. ఇలా అందరి కోసం వీరు కష్టపడడమే కానీ వారికంటూ ప్రశాంతత లేదా సంతోషం ఉందా అంటే చాలా మందికి లేదనే చెప్పాలి. వారి ఇష్టాలకు అనుగుణంగా బ్రతకడం లేదనే చెప్పాలి. చిన్నప్పటి నుండి తన బ్రతుకు అనేక రూపాంతరాలు చెందుతుంది. తను పుట్టిన రోజు నుండి ఇంట్లో అనేక ఆంక్షలు ఉంటాయి. తల్లి తండ్రుల మాటలను గౌరవిస్తూ వారి చెప్పిన మాటలను వింటూ పెరుగుతారు.
ఇలా పెరుగుతూనే చక్కగా చదువుకోవాలి. ఎవ్వరితోనూ మాట్లాడకూడదు. అణకువగా ఉండాలి ఇలా ఎన్నో ఆంక్షలు ఆమెను తొక్కేస్తూ ఉంటాయి. కానీ తనుకూడా ఒక మనిషే అని నాకు కూడా కొన్ని ఆకాంక్షలు ఉంటాయని తెలుసుకుని స్వేచ్ఛను ఇస్తున్నది ఎంత మంది. ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో సమాన హక్కుతో రాణిస్తున్న మహిళలు కొందరే బయటున్నారు. ఇంకా ఎంతో మంది మహిళలు ఎంతో ప్రతిభ ఉంది కూడా మారుమూల ప్రాంతాల్లో కుటుంబ కట్టుబాట్ల నడుమ చస్తూ బ్రతుకుతున్నారు. లాంటి వారంతా తమ ప్రతిభను ఈ ప్రపంచానికి చూపే అవకాశం వచ్చినప్పుడే వారి జీవితానికి నిజమైన అర్ధం ఉంటుంది.
మరి ఆ రోజులు వస్తాయా ? అంటే ప్రశార్ధకమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే అలా బయటకు వస్తున్న మహిళలను మృగలాంటి మెగా రాబందులు బ్రతకనిస్తున్నారా ? బయటకొస్తే చాలు పీక్కుతింటున్నారు. ఈ పద్ధతి పూర్తిగా మారాలంటే చట్టాలలో కఠినమైన శిక్షలను తీసుకు రావాలి. చట్టాలను చేస్తే సరిపోదు, వాటిని సక్రమంగా మేలు పరిచినప్పుడే అన్యాయంగా ఆడబిడ్డలను చిదిమేసే క్రూర మృగాలకు బుద్ది వస్తుంది. వారికి పడ్డ శిక్షను చూసి ఒక్క మహిళ తప్పించుకున్నా మనము చేసింది సరైనదే అవుతుంది. మహిళా లోకానికి నిజమైన ప్రశాంతత ఇదే. ఈ రోజు ప్రతి ఒక్క మహిళ కోరుకునేది ఈ ఒక్కటే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: