అమ్మ: బిడ్డకి తల్లి పాలు పట్టడంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే..??

N.ANJI
సాధారణంగా బిడ్డకు తల్లిపాలు పట్టించడం మంచిదని అందరు చెబుతుంటారు. ఇక శిశువు పుట్టిన గంట లోపు నుంచీ కనీసం ఆరు నెలల వరకూ తల్లి పాలు మాత్రమే పట్టిస్తే మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలియజేసింది. అయితే తల్లి పాల వల్ల న్యుమోనియా, డయేరియా, చెవికి వచ్చే ఇంఫెక్షన్స్ తగ్గుతాయని డాక్టర్లు కూడా చెబుతున్నారు. కాగా.. తల్లి పాల వల్ల బిడ్డకి ఎలాంటి ఎలర్జీలు రాకుండా చేస్తుంది. అంతేకాక.. వారి తెలివితేటలు కూడా వృద్ధి పొందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇక ప్రస్తుతం చాలా మంది ఆలోచించని ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే అదేమిటంటే.. బిడ్డ జననానికి ముందు ఆ తల్లిదండ్రులు తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ఒక్కసారి చూద్దామా. అయితే ప్రసవానంతరం, తల్లి పూర్తిగా తేరుకోకముందే బిడ్డని గుండెకి హత్తుకుని పాలు పట్టించడం అలవాటు చేయవలసి వస్తుంటుంది. ఇక
అందుకే ప్రసవానికి ముందే తల్లి ఇవి తెలుసుకుని ఉంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  
అయితే అందులో మొదటి విషయం ఏంటంటే.. చాలా హాస్పిటల్స్ ఇప్పుడు యాంటీ నేటల్ క్లాసులు కండక్ట్ చేస్తుంటాయి. అదిలేక లాక్టేషన్ కన్సల్టెంట్ అవుతుంటారు. ఇక వీరు బిడ్డని ఏయే పద్ధతుల్లో పట్టుకుని పాలివ్వాలో నేర్పిస్తుంటారు. అలాగే మీ డాక్టర్‌ని కానీ లాక్టేషన్ కన్సల్టెంట్‌ని కానీ మీ బ్రెస్ట్‌ని పరీక్ష చేయమని అడిగితే వారు ఫ్లాట్ నిపిల్స్, లేదా ఇన్వర్టెడ్ నిపిల్స్ వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో చూపిస్తుంటారు.
కాగా.. ఇవి ఉంటే మొదట్లో కొన్ని చికాకులు ఎదురవుతాయని వైద్యులు చెబుతుంటారు. ఇక వీటిని ఎలా తప్పించుకోవాలో, లేదా ఎలా ఎదుర్కోవాలో మీ కన్సల్టెంట్ మీకు నేర్పిస్తారని తెలిపారు. కాగా.. అప్పుడు మొదట్లో మీరు కంగారు పడకుండా ఉంటారని తెలిపారు. ఇక పైగా ఇలా చేయడం వల్ల నిపిల్స్ మంట పుట్టడం వంటి సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: