రోటీ చేసి ఇంటర్నెట్ సంచలనం గా మారిన అమ్మాయి.. ఎవరో తెలిసిపోయింది
ఆ విధంగా ఆమధ్య రోటి చేస్తూ సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అయినా అమ్మాయి ఏవేవో ఇప్పుడు తెలిసిపోయింది. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న యువతీ ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో ఉన్న ఆమెను ను తెలుసుకోవడానికి అందరు ప్రయత్నించారు. సోషల్ మీడియా లో సంచలనం సృష్టించిన ఈ రోటి అమ్మాయి గత కొన్ని రోజులుగా వీడియో లో తెగ ఫేమస్ అవగా ఆమె ఎవరు అని సెర్చ్ చేశారు నెటిజెన్లు. ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆమె అందానికి ఫిదా కాగా ఎవరీ సుందరి అని ఆమె ముగ్దమనోహారానికి ఫిదా అయిపోయారు.
ఆమెకోసం గూగుల్ లో తెగ వెతికారు. చివరికి ఆ అమ్మాయి ఎవరో తెలిసిపోయింది. హృదయాలు కట్టిపడేసే ముఖ వర్చస్సు కలిగిన ఈ అమ్మాయి పాకిస్థాన్ కు చెందిన యువతీ అని తేలింది. ఆ వీడియో పోస్ట్ చేసిన యువకుడు కూడా ఈమె ఇంతలా ఫేమస్ అవుతుందని అనుకోని ఉండడు. ఈ నేపథ్యంలో యువతీ గురించిన సమాచారం అందుకున్న పాత్రికేయులు వారితో మాట్లాడేందుకు ప్రయత్నించగా వారు దాన్ని నిరాకరించారు. ఇక అమీనా కు ఇంస్టా లో ఖాతా ఉంది. దాదాపు మూడు లక్షల ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇంట్లో పనులు చేసి వీడియో లు చేసి ఆమె ఎంతో పాపులర్ అయ్యింది.