అమ్మ: గర్భిణుల ఆహార నియమాలు ఇవే..!
అయితే గర్భిణులు ఎక్కువగా తింటే పుట్టబోయే బిడ్డ అధిక బరువుతో ఉంటారని అందరు అపోహ పడుతుంటారు. కానీ వాస్తవానికి అవి అపోహ మాత్రమేనని నిపుణులు అంటున్నారు. ఇక గర్భిణులు ఆహారంలో పోషకాలు అధికంగా ఉండేవిధంగా చూసుకోవాలే తప్ప మోతాదుకు మించి ఆహారం తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణులు ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకూడదని అంటున్నారు. ఇక వీలైనంత వరకు ఆహారాన్ని కొద్దికొద్దిగా నాలుగైదు సార్లు తినడం అలవాటు చేసుకుంటే మంచిదని నిపుణులు పేర్కొన్నారు.
గర్భిణులు అందుబాటులో ఎప్పుడూ కొన్ని పళ్ళు ఉంచుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక అందులో సీడ్‌లెస్ గ్రేప్స్ లాంటివి స్నాక్స్ కింద తీసుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు.. కెఫైన్ అధికంగా లభించే ద్రవపదార్థాలు పూర్తిగా మానేస్తే మంచిదని అంటున్నారు. ఇక బరువు పెరగడం అన్నది గర్భిణులకు సర్వసాధారణ విషయం అని అన్నారు. కానీ.. గర్భిణులు ఒకేసారి అధికంగా పెరగడం లేదా తగ్గడం అన్నది అనారోగ్యానికి సూచనలు అని చెప్పారు. అయితే గర్భిణులు చిప్స్, వేపుడు పదార్థాలు తినడం వలన బరువును పెంచడానికి దోహద పడుతాయన్నారు. అలాంటి తీసుకోవడం గర్భిణుల ఆరోగ్యానికి మంచి కాదని చెప్పుకొచ్చారు. అలాంటి పూర్తిగా మానేస్తే మంచిదని చెప్పుకొచ్చారు.
ఇక ఆస్తమాతో బాధపడే గర్భిణులు వేరుశనగపప్పుకి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ గర్భిణులు వాటిని ఆహారంలోకి తీసుకుంటే పుట్టబోయే శిశువు ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చని నిపుణులు తెలియజేశారు. అంతేకాదు.. కొన్ని రకాల జలచరాలకి దూరంగా ఉండాలని అన్నారు. ఇక పచ్చిమాంసం లేదా ఉడికీ ఉడకని మాంసాహారం అస్సలు తినకూడదని అన్నారు. అయితే మాంసాహారంలో ఉండే లివర్ లేదా లివర్‌తో చేసే ఆహారపదార్థాలకూ పూర్తిగా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.