కడప నగరంలో దేశం గర్వించే పది రూపాయల డాక్టర్ గురించి ఈ విషయాలు తెలుసా.!!.

Mamatha Reddy
ప్రతి మనిషికి వైద్యం చేయించుకోవాలంటే ఈ రోజుల్లో వణుకు పుడుతుంది.. వైద్యం చేయించుకుంటే లక్షల్లో ఖర్చు అవుతుండడంతో వైద్యం చేయించుకోకుండా అనే జబ్బుతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు.. నిజానికి ఈ కార్పొరేట్ హాస్పిటల్ లు వచ్చిన తర్వాత పేద వారి జీవితాలు ఇలాగే తయారయ్యాయి .. వైద్యం చేసుకోవడానికి తగినంత డబ్బు సమకూర్చ లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లేదా ఆ జబ్బుతో బతుకుతూ మధ్యలోనే ప్రాణాలు విడుస్తున్నారు.. అయితే ఇంత ఇంత డబ్బు పెట్టినా బ్రతుకుతామన్న గ్యారెంటీ ఉంటుంది అంటే అది కూడా లేదు.. మరి తక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ వైద్యాన్ని అందించడం సాధ్యమా అంటే సాధ్యమే అంటుంది కడప జిల్లాలోని వైద్యురాలు..
 కేవలం 10 రూపాయలు మాత్రమే ఓపి  సేవలు ఆమె పేద ప్రజలకు అందిస్తుండడం గమనార్హం.. ఓ వైద్యుల్ని సంప్రదించాలి అంటే ఈ రోజుల్లో కనీసం ఐదు వందల ఇవ్వాల్సి ఉంటుంది.. కానీ నూరి మాత్రం పేద ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకొని శభాష్ అనిపించుకున్నారు.. దాంతో అక్కడి ప్రజలకు నూరి పర్వీన్ ఓ దేవుడిలా మారారు.. 250 లేదా 300 ఖర్చును ప్రజలు భరించలేరు అని తెలిసి ఆమె ఈ పది రూపాయలు మాత్రమే కన్సల్టెన్సీ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారట..
 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఆసియన్ డాక్టర్ కావడమే కాదని కమ్యూనిస్టు నాయకుడు గా పనిచేసిన తన తండ్రి యొక్క అడుగుజాడల్లో నడవడమే పేదలకు సేవ చేయడమే అదే  తన లక్ష్యమని వివరించారు.. డాక్టర్ పర్వీన్ కృష్ణాజిల్లాలోని చల్లపల్లి లో 4వ తరగతి వరకు చదువుకున్నారు ఆ తరువాత ఉర్దూ మాధ్యమంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి విజయవాడకు వెళ్లారు.. మైనారిటీ కింద మెడికల్ సీటు పొందిన తర్వాత కడపలోని ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎంబీబీఎస్ కోర్సులో చేరారు.. కాలేజీ లో ఉన్నప్పుడు ఆమె క్లాస్మేట్ స్థానిక అనాధ ఆశ్రమం లోకి వెళ్ళిన సమయంలో అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు గుర్తించారు.. వారికి వైద్య సేవలు అందించారు.. ప్రతి ఒక్కరికి పది రూపాయల కన్సల్టెన్సీ ఫీజు మాత్రమే తీసుకుంటుంది కాబట్టి ఆమెను   పది రూపాయల డాక్టర్ అని పిలుస్తూ ఉంటారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: