అమ్మ: గర్భిణులు ఈ చిట్కాలు పాటించండి..!

N.ANJI
బిడ్డకు జన్మనివ్వాలని ప్రతి మహిళ ఎన్నో కలలు కంటుంది. పుట్టిన బిడ్డతో అమ్మ అనే పిలుపు కోసం తెగ ఆరాటపడుతూ ఉంటుంది. ఇక గర్భం దాల్చిన రోజు నుండి బిడ్డకు జన్మనిచ్చేవరకు చాల జాగ్రత్తలు తీసుకుంటూ తీసుకుంటూ ఉంటారు. ఇక గర్భధారణ సమయంలో ఎలా ఉండాలో.. ఏ ఏ ఆహార పదార్దాలు తీసుకోవాలో ప్రతిది వైద్యులను సంప్రదించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక తల్లి తీసుకునే ఆహారం మీద బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. గర్భిణులు డ్రెస్సింగ్ స్టైల్ కూడా వారి కంఫర్ట్ ఉండేటట్లు ధరిస్తుంటారు. అయితే స్త్రీలు గర్భం ధరించిన తర్వాత తమను తాము కాపాడుకోవాలంటున్నారు వైద్యులు. వారి కోసం కొన్ని చిట్కాలు
ఇక గర్భిణులు మొదటి నెలలో కలకండతో కలిపిన పాలను రోజుకు రెండు పూటలా క్రమం తప్పకుండా తాగాలి. రెండవ నెలలో శతావరి చూర్ణం 10గ్రాముల గోరువెచ్చని పాలలో కలిపి తాగాలి. మూడవ నెలలో పాలను చల్లారిచ్చి ఒక స్పూన్ నెయ్యి, మూడు స్పూన్ల తేనె కలిపి తాగాలి. దీనిని ఎనిమిదవ నెలవరకు అలాగే కొనసాగించాలి. గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే నెయ్యి, తేనె సమపాళ్ళలో కలిపి తీసుకుంటే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాదు.. గర్భిణులు నాల్గవ నెలలో పాలలో వెన్న కలుపుకుని తాగాలి. ఐదవ నెలలో మళ్లీ పాలలో నెయ్యి కలుపుకుని తాగాలి. ఆరు, ఏడవ నెలలో మళ్లీ శతావరి చూర్ణంతో కలిపి పాలు తీసుకోవాలి. ఎనిమిదవ నెలలో గోధుమ రవ్వను పాలలో కలిపి తీసుకోవాలి. మూడవ నెలనుంచి ఎనిమిదవ నెల వరకు రెండుపూటలా పెద్ద స్పూనుతో సోమఘృతం పాలల్లో కలుపుకుని తీసుకోవాలి. గర్భ స్రావం.. గర్భిణీ స్త్రీలకు ఏడవ నెలనుంచి ఎనిమిదవ నెలలో గర్భ స్రావం జరిగే లక్షణాలు కనుక కనపడితే లోధ్రా మరియు మర్రి చెట్టు యొక్క బంకనుకలిపి చూర్ణంలాగా ఒక్కొక్క గ్రామును కలిపి తేనెతో కలిపి తీసుకుంటే గర్భ స్రావం జరగదని వైద్యులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: