అస్సామీ ఐరన్ లేడీ సంజుక్త పరాశర్ గురించి మీకు తెలియని విషయాలు..?

Mamatha Reddy

సంజుక్త పరాశర్ అస్సాం ఐపీఎస్ ఆఫీసర్ గా ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టిందో పదహారు మంది మిలిటెన్లను, యాభై మందికి పేజీ ఉగ్రవాదులను మట్టుపెట్టి డేరింగ్ అధికారిగా పేరు సంపాదించింది. ఆమె గురించి ఇంకొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం
సంజుక్త పరాశర్ 2006 బ్యాచ్ కి చెందిన అస్సామీ ఐపీఎస్ ఆఫీసర్. చిన్నప్పటి నుంచే పరాశర్ ఆటల్లో బాగా చురుగ్గా ఉండేది. అలాగే ఆటలతో పాటు స్విమ్మింగ్, బైకింగ్,రన్నింగ్ పై కూడా ఆమె ఆసక్తి కనబరిచేది. ఆలా 2008 వ సంవత్సరంలో తొలి పోస్టింగ్ పై  మాకుమ్ అనే పట్టణానికి వెళ్ళింది. ఆ తర్వాత ప్రత్యేక ఇంచార్జిగా బాంగ్లాదేశ్ కి  వెళ్ళింది. అక్కడ బోడో మరియు బంగ్లాదేశీయుల మధ్య జరిగిన గొడవలను సద్దుమనిగేలా చేయడంలో సంజుక్త పరాశర్ ముఖ్య పాత్రని పోషించింది.
ఆలా ఎన్నో పదవులను చేపడుతూ డేరింగ్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకుంది. ప్రధాన మంత్రి అయినా వాజ్ పేయ్ చేతుల మీదుగా అవార్డును కూడా అందుకుంది. ఆలా ఐపీఎస్ ఆఫీసర్ గా చేసే సమయం లో ఎంతో మంది ఉగ్రవాదులను పట్టుకుంది. ఇంతటి ధైర్యసాహసాలు చేసిన సంజుక్త జీవితం అందరికి ఆదర్శప్రాయం అవుతుంది.
ఇక సంజుక్త పరాశర్ కుటుంబం విషయానికి వస్తే, ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. తను ఉద్యోగం చేసే
సమయంలో అతడి ఆలనాపాలనా సంజుక్త తల్లి చూసుకుంటుంది.ఆలాగే సంజుక్త భర్త పేరు పురు గుప్తా ఇతడు కూడా ఐఏఎస్ కావడం విశేషం.
సంజుక్త లాంటి లేడీ ఆఫీసర్ వల్ల భారతదేశంలో ఉగ్రవాద వ్యవస్థ అనేది పూర్తిగా అంతం అవుతుంది. ఇలాంటి వాళ్ళు మన దేశంలో పోలీస్ ఆఫీసర్లుగా అవడం మన అదృష్ట్టం అని చెప్పవచ్చు. ఇంకా ఇలాంటి ఆఫీసర్లను చూసి పోలీస్ రంగంలోకి  వచ్చే వారిని ప్రోత్సహించాలి. వాళ్ళని కూడా ఆ లేడీ ఆఫీసర్లా  లాగే  తీర్చిదిద్దాలి. అప్పుడు ఇండియా లో ఉగ్రవాదం అనేది ఉండదు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: