పంజాబ్ ను వెంటాడుతున్న బ్యాడ్ లక్.. పది సంవత్సరాల నిరీక్షణ ఎప్పుడు తిరనుందో..?

Pulgam Srinivas
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా రెండు రోజుల క్రితమే లీగ్ మ్యాచ్ లు కంప్లీట్ అయ్యాయి. ఇక ఈ రోజు నుండి నాకౌట్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఈ విషయం కాసేపు పక్కన పెడితే ... ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పంజాబ్ కింగ్స్ కు మాత్రం ఎక్కడి లేని దురదృష్టం వెంటాడుతుంది. ఈ జట్టు ఈ సారి చాలా దారుణమైన ఆట తీరుతో ప్లే ఆప్స్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వలేదు. ఇకపోతే ఈ జట్టు ఈ సారి మాత్రమే కాదు గత పది సంవత్సరాలుగా ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. 2014 వ సంవత్సరం ఈ జట్టు ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ ఆడింది.

అందులో ఓడిపోయింది. దానితో ఫైనల్ వరకు వెళ్లకుండానే ఈ జట్టు వెను తిరగవలసి వచ్చింది. ఇక 2014 వ సంవత్సరం ఆఖరి సారి ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబ్ జట్టు ఆ తర్వాత ప్రతి సారి లీగ్ దశలోనే వరస ఓటములను మూట గట్టుకొని ప్లే ఆప్స్ వెళ్లకుండానే వెను తిరుగుతుంది. ఇక ఈ సారైనా ఈ జట్టు మంచి ఆట తీరని కనబరిచి పాయింట్ల పట్టిక లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచి ప్లే ఆప్స్ లోకి వెళుతుందేమో అని ఈ జట్టు యాజమాన్యం , ప్లేయర్లు , అభిమానులు అంతా భావించారు.

కానీ ఈ సారి కూడా వీరిని దురదృష్టం వెంటాడింది. వీరు కొన్ని మ్యాచ్ లను చేతులారా కోడగొట్టుకున్నారు. ఈ జట్టు ఈ సీజన్ లో ఏకంగా ఐదు మ్యాచ్ లలో లాస్ట్ ఓవర్ వరకు వచ్చి ఓడిపోయింది. ఈ మ్యాచ్ లు కనుక ఈ జట్టు గెలిచి ఉంటే ఈ సీజన్ లో ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ ఇచ్చేది. మరి వచ్చే సీజన్ లో అయినా పంజాబ్ జట్టు ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ ఇస్తుందో ... లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: