పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'OG' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది..!!

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలు చేస్తూ బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇదిలా ఉంటే యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ OG అనే సినిమాలో నటిస్తున్న సినిమా విషయం తెలిసిందే. యాక్షన్ అడ్వెంచర్ గా రాబోతున్న ఈ సినిమాకి  సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ బయటికి వచ్చింది. దాని ప్రకారం.. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ని జూన్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి

 మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికోసం ఫ్యాన్స్ ఏంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ పాన్  ఇండియన్ ప్రాజెక్టులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు థమన్ మ్యూజిక్  అందిస్తున్నారు. సెప్టెంబర్ 27 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే సాహో సినిమా తర్వాత సుజిత్ లాంగ్ గ్యాప్ తర్వాత

 తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కాగా త్వరలోనే ఈ మూవీ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ కానున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  డీవీవీ  ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఓజీ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రకాశ్‌ రాజ్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: