రుచి శర్మ గురించి మీకు తెలియని విషయాలు

Mamatha Reddy
ఇండియా మొట్టమొదటి పారాట్యూపర్ 'రుచి శర్మ' భాతదేశపు మొట్టమొదటి పారాట్యూపర్.అసలు పారాట్యూపర్ అంటే ఏమిటి? దేశ ప్రధానిని  సైతం ఆశ్చర్యానికి గురి చేసేంతల ఆమె ఏమి చేసింది మొదలైన విషయాలు ఇందులో చూద్దాం.
మహిళా దినోత్సవం రోజున ప్రధాని ఒక అనౌన్స్ మెంట్ చేసారు. అదేంటంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన మహిళ ఎవరు అని ,ఆ మహిళ ని ప్రధాని యొక్క సోషల్ మీడియా ఖాతాలను ఇరవైనాలుగు గంటల పాటు ఉపయోగించుకునే అవకాశం ఇస్తానని ప్రధాని ప్రకటించారు. అయితే దేశవ్యాప్తంగా ఈ విషయం పై చర్చ జరిగింది. ఇంతటి సువర్ణావకాశాన్ని అందుకోవడం అంటే మామలు విషయం కాదని అందరు అనుకున్నారు. అయితే ప్రధాని ప్రకటనకు స్పందిస్తూ శీలాభట్ అనే మహిళా ఒక లేడీ పేరును ప్రస్తావిస్తూ ప్రధాని కార్యాలయానికి తన జీవిత కథను పంపించింది. ఆ లేడీ ఎవరో కాదు 'రుచి శర్మ'. ఆమె పంపిన  కథను పరిశీలించి ప్రధాని కార్యాలయం రుచి శర్మను ఇన్స్పైర్డ్ లేడీ గా ప్రకటించింది. ముందు చెప్పినట్టు గానే ప్రధాని తన ఖాతాలను రుచి శర్మకు ఇస్తున్నట్లు తెలిపారు.
ఇక పారాట్యూపర్ గురించి చూస్తే దీని యొక్క శిక్షణ చాలా అంటే చాలా కఠినంగా ఉంటుందట. పారాట్యూపర్ అంటే శత్రు భూభాగంలోకి పారాషూట్ దిగి వారిని మట్టుపెట్టడం.ఒక్కోసారి శత్రువు ల కోసం కొన్ని వందల కిలోమీటర్లు నడవవలసి ఉంటుంది కూడా అలాగే పారాషూట్  ట్రైనింగ్ కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. వీటన్నిటిని అధిగమించి పారాట్యూపర్ గా సెలెక్ట్ అవ్వడం అంటే చాలా కష్టపడాలి. ఆలా కష్టపడింది కాబట్టే రుచి శర్మ కథ అందరికి నచ్చింది. ఆమెను ప్రేరణ వ్యక్తి (ఇన్స్పైర్డ్ పర్సన్) గా ప్రధానియే ఎన్నుకున్నారు.
తనను ఇన్స్పైర్డ్ పర్సన్ గా ఎంపిక చేయడం పట్ల రుచి శర్మ సంతోషం వ్యక్తం చేస్తుంది. తనకి ఇంతటి గౌరవం దక్కడం అలాగే ప్రధాని సోషల్ మీడియా ఖాతాలను చూసుకునే అదృష్టం కలగడం నిజంగా ఆనందంగా ఉందంటోంది 'రుచి శర్మ' .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: