విశాఖ: టీడీపీ Vs వైసీపీ.. గెలుపు ఆ పార్టీదే?

Purushottham Vinay
విశాఖలో అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే విశాఖపట్నం ఉత్తరం, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం పశ్చిమ, గాజువాక, పెందుర్తి, మాడుగుల, యలమంచిలి, భీమిలి, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, అరకు, పాడేరు, పాయకరావుపేట... ఇలా మొత్తం 15 ఉన్నాయి..వీటిలో ఏ పార్టీ గెలుస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.విశాఖలో  టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో మొత్తం 9 స్థానాల్లో తెలుగు దేశం పార్టీ పోటీ చేస్తోంది.. జనసేన పార్టీ 4 చోట్ల ఇంకా బీజేపీ రెండు చోట్ల పోటీలో ఉంది.వైఎస్సార్సీపీ విషయానికి వస్తే.. విశాఖ జిల్లా అన్ని స్థానాల్లో కూడా ఒంటరిగా పోటీ చేస్తోంది.ఇక వైసీపీ మార్పుల విషయానికి వస్తే విశాఖ తూర్పు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పోటీలో ఉన్నారు. పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే అయిన కంబాల జోగులు పోటీ చేస్తున్నారు. ఇక మాడుగుల నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కుమార్తె అనురాధ పోటీ చేస్తున్నారు. అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ బదులుగా కొత్త అభ్యర్థి అయిన మలసాల భరత్ బరిలో ఉన్నారు. గాజువాక నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీలో నిలిచారు.


పాడేరులో సిట్టింగ్ ఎమ్మెల్యే కొట్టగుళ్ల భాగ్యలక్ష్మిని పక్కన పెట్టి ఎం.విశ్వేశ్వర రాజుకు ఛాన్స్ ఇచ్చారు. అరకు లోయలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణను పక్కన పెట్టి రేగం మత్స్యలింగం పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు.ఇక తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల విషయానికి వస్తే.. గంటా శ్రీనివాసరావు ఈసారి మళ్లీ నియోజకవర్గం మార్చి భీమిలి నుంచి పోటీలో ఉన్నారు. అలాగే మాడుగుల నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పోటీ చేస్తున్నారు. మిగిలిన స్థానాల్లో మాజీ ఎమ్మెల్యే, పాత ఇంఛార్జ్‌లకే చంద్రబాబు నాయుడు టికెట్లు ఇచ్చారు.అనకాపల్లిలో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. అరకులో టీడీపీ, బీజేప, జనసేన కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత బరిలో ఉన్నారు.ఇక ఓవరాల్ గా అరకు, పాడేరు, మాడుగుల, విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణంలో వైసీపీ గెలిచే ఛాన్స్ ఉన్నట్లు ఇండియా హెరాల్డ్ చేసిన సర్వే ద్వారా  తెలుస్తుంది. ఇక అనకాపల్లి, గాజువాక, చోడవరం, పెందుర్తి, విశాఖ తూర్పు, నర్సీపట్నం, భీమిలి ఇంకా మిగిలిన ప్రదేశాల్లో టీడీపీ ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా విశాఖలో టీడీపీ నెగ్గే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: