బాహుబలి బ్రాండ్ ఇమేజ్ కొనసాగుతుందా !

Seetha Sailaja
టాలీవుడ్ మార్కెట్ ను ఒక్కసారిగా 1000 కోట్ల స్థాయికి తీసుకు వెళ్ళిన ‘బాహుబలి’ మూవీ ఒక చరిత్ర. ఆ మూవీతో ప్రభాస్ రానా రాజమౌళి లు పాన్ ఇండియా సెలెబ్రెటీలుగా మారిపోయారు. అయితే ఆ మూవీని ఈతరం ప్రేక్షకులు నెమ్మదినెమ్మదిగా మర్చిపోతున్న పరిస్థితులలో రాజమౌళి తిరిగి ఆ బ్రాండ్ ఇమేజ్ ని కొనసాగించడానికి చేస్తున్న ప్రయత్నమే ఇప్పుడు ‘బాహుబలి’ యానిమేషన్ సిరీస్. వచ్చే వారం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

ఈ యానిమేషన్ సిరీస్ ని ప్రమోట్ చేస్తూ రాజమౌళి ‘బాహుబలి’ బ్రాండ్ ఇమేజ్ ని జనంలో ఎప్పుడు ఉండే విధంగా జక్కన్న వ్యూహాలు రచిస్తున్నాడు. అయితే ‘బాహుబలి’ మూవీ ధియేట్రికల్ గా ప్రేక్షకులకు ఇచ్చిన అనుభూతి ఈ యానిమేటెడ్ సిరీస్ ఇవ్వగలుగుతుందా అన్న సందేహాలు చాలామందికి వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఎన్నో హై క్వాలిటీ యానిమేటెడ్ సిరీస్ లను చూసి ఎంజాయ్ చేసిన సగటు ప్రేక్షకులు ఈ యానిమేటెడ్ సిరీస్ ను ఎంతవరకు బుల్లితెర పై ప్రేక్షకులను ఆనంద పెడుతుంది అన్న సందేహాలు మరికొందరి వస్తున్నాయి.

ఇప్పటికే విడుదలైన ఈ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ లోని విజువల్స్ మరీ ఎక్స్ ట్రాడినరిగా అనిపించకపోవడంతో కొందరు ఈ యానిమేటెడ్ సిరీస్ పూర్తిగా విడుదల కాకుండానే కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కొంతకాలం క్రితం ‘బాహుబలి’ ని నెట్ ఫ్లిక్స్ కోసం రియల్ వెబ్ సిరీస్ గా తీయాలని ప్రయత్నించి కొంత షూటింగ్ అయ్యాక అవుట్ ఫుట్ సరిగా రాలేదని ఆపేసినట్లు వార్తలు వచ్చాయి.

దీనితో ఈ యానిమేటెడ్ సిరీస్ ను ఓటీటీ లో బుల్లితెర ప్రేక్షకులు ఎంతవరకు ఎంజాయ్ చేస్తారు అన్న విషయమై భిన్నాభిప్రాయాలు కొనాసాగుతున్నాయి. ఎప్పటికైనా రాజమౌళికి ‘బాహుబలి 3’ తీయాలి అన్నది కోరిక. అయితే ఆ కథను ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అన్న విషయమై రాజమౌళి కన్ఫ్యూజన్ లో ఉండటంతో ఆ ఆలోచన చాల నెమ్మదిగా రాజమౌళిలో కొనసాగుతోంది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: