రాయలసీమ: హిందూపూర్ ప్రజలకు స్వామీజీ బంపర్ ఆఫర్.. గడప గడపకూ రూ.లక్ష..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం కావడంతో పలు పార్టీలు సైతం హామీలు ఇస్తూ ప్రజలను మభ్య పెట్టేందుకు తీవ్రంగా పలు రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. బడా రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కూడా ఓటర్లకు సైతం గాలం వేసే విధంగా హామీలను కురిపిస్తున్నారు.కొన్నిచోట్ల అభ్యర్థులే తమకోసం వ్యక్తిగతంగా ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తున్నారు.. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో హిందూపురం నుంచి నిలబడ్డ స్వామీజీ ఇచ్చిన హామీ ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతోంది.

ఏకంగా తన నియోజకవర్గంలో ఉండే ప్రతి ఇంటికి కూడా లక్ష రూపాయలు లబ్ధి చేకూరేల చేస్తానంటూ పరిపూర్ణానంద స్వామీజీ తెలియజేశారు.. ముఖ్యంగా ఈ స్వామీజీ 2018 తెలంగాణ ఎన్నికలవేళ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. బిజెపి తరఫునుంచి ప్రచారం చేశారు. ఇప్పుడు మళ్లీ 2024 లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఆయన బిజెపి పార్టీ నుంచి బరిలోకి దిగబోతున్నానని అందరూ అనుకున్నారు.. హిందూపురం నుంచి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా ఉండాలని ప్రయత్నించిన పొత్తులో భాగంగా ఆ సీటు టిడిపికి వెళ్లిపోయింది. ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఎంపీగా బికె.పార్థసారథి దక్కించుకున్నారు.

దీంతో పరిపూర్ణానంద స్వామి అసంతృప్తికి గురై స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు.. ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ పరిపూర్ణానంద స్వామి గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకర్షించే విధంగా మాట్లాడుతున్నారు.. తెలుగు రాష్ట్రాలలో హిందూ అనే పేరు ఉన్న నగరం ఇదేనని అందుకే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని వెల్లడించారు.. హిందూపురం నియోజకవర్గం ప్రజలకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ ఎన్నికలలో ఓటర్లు అగ్గిపెట్టి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే ప్రతి ఇంటికి లక్ష రూపాయల లబ్ధిని కూడా కలిగిస్తానంటూ ఒక హామీని వెల్లడించారు..ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే వ్యక్తిగతంగా తాను ఇచ్చిన హామీలతో పాటు ప్రభుత్వ పథకాలకు కూడా అమలయ్యేలా చేస్తానని వెల్లడించారు. మరి దీన్ని బట్టి చూస్తే అక్కడ బాలయ్యకు దెబ్బ పడేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: