స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి సారి ఉరి శిక్ష అమలు చేయబోతుంది ఈ మహిళకే

Mamatha Reddy
ప్రేమ గుడ్డిదే కాదు మూగది, చెవిటిది కూడా.. ప్రేమించిన అమ్మాయి కోసమో.. అబ్బాయి కోసమే ఒక్కోసారి ఎంతటి దారుణానికైనా దిగజార్చుతుందనేందుకు ఎన్నో ఘటనలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లోనూ జరిగింది. ఘటనలో నిందితురాలికి ఉరిశిక్ష పడింది. త్వరలో ఉరికంబం ఎక్కబోతోంది. ఆమెకు కడుపున బిడ్డ మాత్రం అనాథవుతున్నాడు.
యూపీలోని ఆమ్రోహ చెందిన షబ్నం.. డబుల్ ఎంఏ చేసింది. ఇంటి పక్కనే ఉండే ఓ రంపపుకోత మిల్లులో పనిచేసే సలీం అనే యువకుడిని ప్రేమించింది. వాడి మాయలో పూర్తిగా పడిపోయింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుని షబ్నం ఇంట్లో విషయం చెప్పారు. అందుకు వారు అంగీకరించలేదు. దీంతో రాత్రి వాళ్లు తాగే పాలల్లో మత్తు మందు కలిపింది. అందరూ మత్తులోకి జారుకోగానే.. కుటుంబ సభ్యులను ఆ ప్రేమజంట అతి కిరాతకంగా నరికి చంపేసింది. తల్లిదండ్రులు, బామ్మ, తాత, తోబుట్టువులు.. ఇలా కుంటుంబంలో ఒక్కరూ కూడా మిగలకుండా చంపేశారు. కానీ ఇంత చేస్తే ఏం మిగిలింది. కటకటాల వెనక్కి వెళ్లారు. స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించింది. 2018లో ఈ ఘటన సంచలనం రేపింది.
షబ్నం చేసిన తప్పుకు ఉరిశిక్ష పడింది. కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితి ఏంటి.. ఆమె జైలుకు వెళ్లేటప్పుడే ఏడు నెలల గర్భిణీ.. జైలులోనే బిడ్డ పుట్టాడు. వాడి పేరు తాజ్.. వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. తర్వాత కేర్ టేకర్ కు అప్పగించారు అధికారులు. ప్రస్తుతం తాజ్ కేర్ టేకర్ పర్యవేక్షణలో చదువుకుంటున్నాడు. అప్పుడప్పుడూ తల్లిని జైలులో కలుస్తుంటాడు. ఇప్పుడు షబ్నంను ఉరితీయబోతున్నారు.
ఉరిశిక్షను రద్దు చేయాలని హైకోర్టు, సుప్రీంకోర్టు  అన్ని మెట్లు ఎక్కారు. చివరకు రాష్ట్రపతి క్షమా భిక్ష కూడా నిరాకరించడంతో చివరకు ఉరిశిక్ష తప్పలేదు. షబ్నమ్ తప్పుచేసింది కాబట్టి.. ఆమెకు శిక్ష వేయడంలో తప్పులేదు.. కానీ తాజ్ ఏం తప్పు చేశాడు. తాను చేయని తప్పుకు పుడుతూనే జైలు శిక్ష అనుభవించాడు. ఆత్మీయులందరినీ పోగొట్టుకున్నాడు. ఉన్న తల్లి కూడా దూరం కాబోతుంది.  తల్లి చేసిన తప్పుకు ఆ పిల్లాడు జీవితాంతం శిక్ష అనుభవించాల్సిందేనా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: