అమ్మ : గర్భధారణ సమయంలో వచ్చే ఈ మార్పులు గురించి తెలుసుకోండి.. !!
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఫేస్ చేసే కొన్ని అసౌకర్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.చాలామంది మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో వాసనను గుర్తించే సామర్థ్యం మరింత పెరుగుతుంది. దురదృష్టవశాత్తు, చాలామంది మహిళలు ఇంతకు ముందు తమకు ఎటువంటి ఇబ్బంది కలిగించని వాసనలు ప్రెగ్నెన్సీ దశలో మరింత అసౌకర్యాన్ని కలిగించాయని చెబుతున్నారు.అంటే కొంతమందికి కొన్ని రకాల వాసనలు చుస్తే అసలు నచ్చదు..ప్రెగ్నన్సీ హార్మోన్స్ అనేవే సమస్యకు కారణం. ఈస్ట్రోజెన్ ఉత్పత్తి పెరగడం వలన ప్రతి చిన్న వాసన మీకు ఘాటుగా అనిపిస్తుంది. అలాగే ప్రెగ్నన్సీ సమయంలో చాలామంది మహిళలు ఎదుర్కునే ప్రధాన సమస్య గ్యాస్ ప్రాబ్లెమ్. తొమ్మిది నెలల సమయంలో ఎప్పుడైనా గ్యాస్ ప్రాబ్లమ్ ఎదురవవచ్చు.
ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది ప్రెగ్నన్సీ సమయంలోని అదనపు గ్యాస్ ను కలిగించే ముఖ్య కారణమని గుర్తించాలి. గ్యాస్ ప్రాబ్లెమ్ ను తెచ్చిపెట్టే ఫుడ్స్ ను తినకపోవడం మంచిది.
కార్బనేటడ్ బేవరేజెస్, డైరీ ప్రోడక్ట్స్, క్రూసిఫెరస్ వెజిటబుల్స్, గార్లిక్, స్పినాచ్, పొటాటోస్, బీన్స్ అలాగే హై ఫైబర్ ఫుడ్స్ ను అవాయిడ్ చేయడం ఉత్తమం. లార్జ్ మీల్స్ ను తీసుకోకూడదు. స్మాల్ మీల్స్ ను తరచూ తీసుకోవాలి.ప్రెగ్నన్సీ సమయంలో ఇంకొక సమస్య ఎంతంటే తరచూ బాత్రూంను విజిట్ చేయాల్సిన అవసరం తలెత్తుతుంది. ఇది కొన్నిసార్లు ఎంబరాసింగ్ గా అనిపిస్తుంది. పబ్లిక్ ప్లేసెస్ లో ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సమయంలో కాఫీ, టీ అలాగే కొన్ని కార్బనేటడ్ డ్రింక్స్ ను తాగడం మానేయాలి. ఇవన్నీ డైయూరేటిక్స్…అంటే ఇవి యూరిన్ ప్రొడక్షన్ ను ఇంక్రీజ్ చేస్తాయి. తరచూ బాత్రూంకు వెళ్లాల్సిన అవసరాన్ని కలిగిస్తాయి