అవాంఛిత రోమాల వల్ల ఇబ్బంది పడే ఆడవాళ్లకి కొన్ని చిట్కాలు.. !!
పసుపు ప్రతి రోజు మన వంటల్లో వాడేదే.. పసుపు లో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు అవాంఛిత రోమాలును తొలగించి ముఖంలో తేజస్సుని, అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. దీన్ని ఆయుర్వేదం లో ఒక మెడిసిన్ లా కూడా ఉపయోగిస్తారు. పసుపుని శెనగపిండి తో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి, పసుపు రోమాలను తొలగించటమే కాకుండా వాటి పెరుగుదలను కూడా అదుపులో ఉంచుతుంది.అలాగే శెనగపిండి భారత దేశం లో చాల మంది ముఖానికి మాస్క్ లా ఉపయోగిస్తారు. మన చర్మం పై ఉండే అవాంచిత రోమాలను తొలగించుటలో ఎంతో సహాయ పడుతుంది. శెనగపిండిని కొద్దిగా పసుపు,పెరుగుతో కలిపి ముఖానికి రాసుకుంటే ఎంతో ప్రభావవంతమైన ఫలితాన్ని ఇస్తుంది. సహజ నివారణలు వాడటం వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అంతేకాకుండా శనగపిండి, నిమ్మరసం, నీరు కలిపిన మిశ్రమం అవాంఛిత చర్మాలను తొలగించుటలో శక్తివంతంగా తగ్గిస్తుంది. ఈ రకమైన మాస్క్ తయారీలో 10 మిల్లిలీటర్ల నిమ్మరసం, 30 గ్రాముల శనగ పిండిని ఒక కప్పు నీటిలో కలిపండి. పసుపు రంగులో ఉండే ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల వరకు ఉంచి, తొలగించండి. కొన్ని రోజులు ఇలా చేయడం వల్ల సమస్య తగ్గుతుంది.
ఇది కొంచం తక్కువ ఖర్చుతో ఇళ్లలో వ్యాక్సింగ్ చేసుకునే ఒక పద్దతి. కొద్దిగా చక్కెర లో కొంచెం తేనె మరియు నిమ్మ రసం కలిపి ఈ మిశ్రమం ముఖం పై రాసుకోవాలి. దీన్ని ఒక క్లాత్ స్ట్రిప్ చేత తొలగించాలి. ఈ ప్రక్రియ అత్యంత సమర్థవంతమైనదే కానీ ఓ మొస్తరు భాధను కలిగిస్తుంది.
అలాగే గుడ్డు లోని తెల్ల సొనను ఒక గిన్నె లో తీసి అందులో ఒక చెంచాడు పంచదార, అర చెంచాడు మొక్కజొన్న పిండి కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖం పై రాసుకుని కొద్దిసేపు ఆరనివ్వాలి. తర్వాత ఒక మాస్క్ లా మారిన దీన్ని మెల్లగా తిసి వేస్తే దానితో ఈ అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి. ఈ పద్ధతి కూడా మంచి ఫలితాలను అందిస్తుంది.