మహిళలు రోజు తలస్నానం చేస్తే జుట్టు ఇలా అవుతుందట తెలుసా.. !!

Suma Kallamadi
ఈ కాలంలో చాలామంది ఆడవాళ్లు జుట్టుకి నూనె అసలు పెట్టడం లేదు.ఫ్యాషన్ పేరుతో ప్రతి రోజు  తలస్నానం చేస్తున్నారు.మరికొంత మందికి  అయితే తలస్నానం చేస్తే కానీ.. స్నానం చేసినట్టు ఉండదు.తలస్నానం చేస్తే రోజంతా ఫ్రెష్ గా, ప్రశాంతంగా ఉండొచ్చు అని మరికొందరు అనుకుంటారు. కొందరు జిడ్డు చర్మం కారణంగా రోజూ తలస్నానం చేస్తుంటారు. ఇలా రోజూ తలస్నానం చేయడం వల్ల ఆడవాళ్ళ జుట్టుపై ప్రభావం పడుతుంది.ఇలా తలస్నానం చేయడం వల్ల కొన్నాళ్ళకు షాంపూల ప్రభావం జుట్టుపై పడుతుంది. అలాగే మాడుపై ఉండే సహజ నూనెలు పోయి జుట్టు ఎండుగడ్డిలా మారుతుంది.ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే తక్కువ గాఢత ఉన్న నాణ్యమైన షాంపూతో రోజు విడిచి రోజూ లేదా రెండు రోజులకి ఒకసారి తలస్నానం చేయడం మంచిది.

క్రమం తప్పకుండా తలస్నానం చేసేవాళ్లలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుందట. రకరకాల షాంపూలను వాడుతూ తలస్నానం చేయడం వల్ల షాంపూల్లోని కెమికల్ వల్ల జుట్టు రాలే సమస్య అధికమవుతుందని నిపుణులు చెబుతున్నారు. వారానికి ఒక్కసారి అయిన  గోరువెచ్చని కొబ్బరినూనెతో తలకు మర్దన చేసుకోవడం మంచిది.అలాగే తల స్నానం చేసిన తర్వాత ముందు జుట్టును శుభ్రంగా తుడుచుకొని ఆరిన తర్వాత వెడల్పాటి పళ్లున్న దువ్వెనతో నెమ్మదిగా దువ్వుకొవాలి. అంతేగాని జుట్టు చిక్కుపడిందని బలవంతగా జుట్టుని దువ్వకూడదు.అలా దువ్వడం వల్ల జుట్టు మరింత ఊడిపోతుంది.

ఆడవాళ్ళ జుట్టు రంగు దీర్ఘకాలం అలాగే కొనసాగాలంటే, తలస్నానం చేయకపోవడం మంచిది. వారానికి రెండు మూడు రోజులు తలస్నానం చేసిన సరిపోతుందని నిపుణులు  వెల్లడిస్తున్నారు. అలా కుదరకపోతే షాంపూల వాడకం తగ్గించి సహజసిద్ధమైన కుంకుడు కాయలు వాడితే జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది.. అలాగే మీరు ఒకవేళ తప్పకుండా తలస్నానం చేయాలి అనుకుంటే రాత్రి తలకి బాగా నూనె పెట్టి ఉదయాన్నే తలస్నానం చేస్తే మంచిది. అలాగే తల స్నానం వేగంగా చేయకూడదు. షాంపు, కండిషనర్లు శుభ్రంగా పోయేదాకా చేయాలి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: