ఆ స‌మ‌యంలో స్వీట్స్ ఎక్కువగా తింటే చాలా డేంజ‌ర‌ట‌..!!

Kavya Nekkanti

స్వీట్స్.. సాధార‌ణంగా వీటిని అంద‌రూ ఇష్టంగా తింటారు. ఇష్టంగా తింటే ప‌ర్వాలేదు కానీ, ప‌రిమిని మించి తింటే మాత్రం అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని ఆరోగ్య నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతూనే ఉన్నారు. అందులో ముఖ్యంగా ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఓవ‌ర్ స్వీట్స్ తింటే.. ఆ ప్ర‌భావం పుట్టే పిల్ల‌ల‌పై ప‌డుతుంది. వాస్త‌వానికి గర్భం దాల్చడం అనేది మహిళ జీవితంలో అత్యంత ఆనందాన్ని ఇచ్చే అద్భుత క్షణాలు. అయితే ఈ సమయంలో ఎలా ఉండాలి, ఏం తినాలి ఏం తినకూడదు వంటి నియమాలు సరిగ్గా పాటించకపోవడం వల్ల‌ గర్భం కోల్పోవడం జరుగుతోంది.

 

అందుకే గర్భంతో ఉన్నప్పుడు మీతోపాటు మరో ప్రాణం మీ కడుపులో ఉందని ఏమాత్రం మర్చిపోకూడదు. ఇక ప్రెగ్నెస్సీ సమయంలో తినే ఆహారం తల్లినీ, బిడ్డనీ కూడా ప్రభావితం చేస్తుంది. మరీ ముఖ్యంగా పంచదార ఎక్కువ ఉన్న పదార్ధాలు వీలైనంత తగ్గించమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల తల్లీబిడ్డా కూడా ఓబేసిటీ ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయాల్సి వస్తుంది. పిల్లలు పుట్టే సమయానికే ఎక్కువ బరువు ఉండొచ్చు లేదా.. పుట్టాక బరువు పెరగవచ్చ‌ని అంటున్నారు.

 

తల్లులు ప్రెగ్నెంట్ టైమ్‌లో స్వీట్స్ ఎక్కువగా తింటే పిల్లలకి చిన్నప్పుడే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంటున్నారు. అలాగే ఓ ఆధ్య‌య‌నం ప్రాక‌రం.. ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో త‌ల్లి ఎక్కువ‌గా స్వీట్స్ తింటే పిల్లల తెలివితేటల మీద ప్రభావం చూపిస్తుంద‌ట‌. చెప్పింది త్వరగా అర్ధం చేసుకోవడంలోనూ, గుర్తుపెట్టుకోవడంలోనూ.. పిల్లలు ఇబ్బంది పడతార‌ట‌. అందుకే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో స్వీట్స్‌కు దూరంగా ఉండ‌మ‌ని అంటున్నారు. ఒక‌వేళ తియ్యగా ఏమైనా తినాలనిపిస్తే పండ్లు తినడం మంచిది. పంచదార కలపకుండా పండ్ల రసం తీసుకోవచ్చు. లేదా బెల్లంతో చేసిన పదార్ధాలు కూడా తినవచ్చ‌ని సూచిస్తున్నారు. సో.. ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండండి.

  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: