పెరుగుతో అందం ఇంకా మీ సొంతం... !!

Suma Kallamadi

 ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలనే కోరుకుంటారు.ఆడవాళ్ళకి అందమంటే మహా ఇష్టం.  అయితే ఈ క్రమంలో కొంత ఖర్చవుతుందేమోనన్న భయం కూడా వెంటాడుతోంది. ఒక్కసారి, వంటింటిని పరిశీలిస్తే అందంగా తయారు కావడానికి అవసరమైన పదార్థాలన్నీ లభిస్తాయన్న విషయాన్ని విస్మరించకూడదు. అద్భుతమైన, కాంతివంతమైన చర్మాన్ని సొంతం చేసుకునేందుకు వంటింటిలో లభించే అత్యద్భుతమైన పదార్థాలను ఒకసారి గమనించి తీరాలి.చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా తయారు చేయడంలో పెరుగు ముఖ్యపాత్ర పోషిస్తుంది. కేవలం పెరుగునే ఫేస్ మాస్క్ గా అప్లై చేసుకున్నా మెరుగైన ఫలితముంటుంది.

 

పెరుగులో ల్యాక్టిక్ యాసిడ్ లు అత్యధిక స్థాయిలో లభిస్తాయి. అంతే కాకుండా, విటమిన్స్, మినరల్స్ కూడా లభిస్తాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే, పెరుగులో ఉండే యాంటి మైక్రోబియాల్ ప్రాపర్టీస్ చర్మ సమస్యలకు రెమిడీగా పని చేస్తాయి.చర్మానికి దోసకాయ, పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు. చర్మాన్ని సంరక్షిస్తూ తేమను పెంపొందించే క్రమంలో పెరుగు, దోసకాయ పోషించే పాత్ర అమితం. అలాగే స్కిన్ టానింగ్ ను తగ్గించి పింపుల్స్ నుండి చర్మాన్ని కాపాడుతుంది.

 

ఇంట్లో సులభంగా తయారుచేయగలిగే ప్యాక్ ఇది. తాజాగా తురిమిన దోసకాయ గుజ్జుతో పెరుగుని కలిపి ఒక ప్యాక్ గా ప్రిపేర్ చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 20 నిముషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. పనిలోపనిగా రెండు దోసకాయ ముక్కలను కళ్లపై ఉంచుకోవడం మరచిపోకండిఅన్ని రకాల చర్మాలకు ఈ ఫేస్ ప్యాక్ సూట్ అవుతుంది. చర్మానికి తేమను అందించి మృత కణాలను తొలగించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది.

 

ఓట్ మీల్, పెరుగు, తేనెను సమాన మోతాదులో తీసుకుని ముఖంపై అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీళ్ళను ముఖంపై జల్లుకుని శుభ్రంగా కడగాలి.రెండు మ్యాష్ చేసిన స్ట్రాబెర్రీస్ లో ఒక టీస్పూన్ తేనెను, ఒక టీస్పూన్ పెరుగును కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ను ముఖంపై అప్లై చేయాలి. కనీసం 15-20 నిమిషాల పాటు ఈ ప్యాక్ ను ఉంచాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో ఈ ప్యాక్ ను సున్నితంగా తొలగించాలి. ఆ తరువాత నేచురల్ మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం మరవకూడదు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: