విజయం మీదే: లక్ష్యం ముఖ్యమే... దారి సరైనదా కాదా?

VAMSI
ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఎన్నో ఆశలు, కోరికలను కలిగి ఉంటారు. అసలు ఆశలు లేని వారు ఉంటే ఆశ్చర్యపడాలి. అదే విధంగా అందరికీ తమ జీవితం అందంగా ఉండాలని ఆనందంగా సాగిపోవాలని ఉంటుంది. అయితే అప్పటి కాలంలో అయితే వేరు కానీ ఇప్పుడు జనరేషన్ ఎంత గానో మారింది. అందరూ కాలంతో ఉరుకుల పరుగుల జీవితంలో బిజీ అయి పోయారు. ముఖ్యంగా డబ్బు ప్రదానం అయిపోయింది. లక్ష్యం ఏదైనా అది చివరికి ఆర్థికంగా స్థిర పడటం అనే భావన అందరిలోనూ కనిపిస్తోంది. లాభాలను ఆర్జించేందుకు అందరి పరుగులు అన్నట్లుగా జీవితాలు మారుతున్నాయి.
నిలబడి నీళ్ళు తాగడం కన్నా పరుగులు తీసి పాలు తాగడం మిన్న అని చాలా మందే అనుకుంటున్నారు. అదే సూత్రాన్ని తమ జీవితాలలో అప్లై చేస్తున్నారు. అయితే గమ్యం ఏదైనా జీవితంలో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందీ లేకుండా సంతోషంగా ఉండాలన్నదే  చాలా మంది ఉద్దేశం. అయితే ఇది ఎంత వరకు సమంజసం.. నిజమే మన లక్ష్యం దాదాపుగా ఎప్పుడూ మన కోసమో లేక మన కుటుంబ సభ్యుల కోసమో ఉంటుంది. నేటి రోజుల్లో మనం , మన వారు సంతోషంగా సౌకర్యంగా జీవించాలి అంటే ధనం చాలా అవసరమే. కానీ ధనం మాత్రమే అవసరం కాదు అన్న విషయాన్ని అందరూ గ్రహించాలి.
జీవిత లక్ష్యం అనేది మనకి ఉపయోగపడేలా ఉండాలి నిజమే అదే సమయంలో ఇతరులకు హాని కలిగించకుండా, అంతే కాకుండా అందరికీ అది స్ఫూర్తిదాయకంగా ఉండాలి. దీనిని బట్టి మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే మీరు ఏది సాధించినా సత్య మార్గంలో మాత్రమే సాధించాలి, అదే సమయంలో దాని వలన ఏ ఒక్కరూ బాధ పడకూడదు. ఇలా ఏ ఒక్కరో ఆలోచించడం కాదు. ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే చాలా సమస్యలు ఉండవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: