విజయం మీదే: ఎదుటి వారి హేళనలోనే విజయాన్ని చూసుకో?

VAMSI
ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరూ ఎలాగైనా ఒక పెద్ద స్థాయికి చేరుకోవాలని కలలు కంటున్నారు. అయితే కొందరు మాత్రం పూర్తిగా అనుకున్న విధంగా విజయాన్ని సాధించి, ముందుకు వెళుతుంటే మరి కొందరు అనుకున్న లక్ష్యం వైపు సక్సెస్ కాలేక, మధ్య లోనే లక్ష్యాన్ని వదిలేసి వెనుతిరుగుతున్నారు. అయితే అలాంటి వారికి కూడా అనుకున్నది సాధించాలని, విజయాన్ని అందుకోవాలని ఉంటుంది. కానీ కొందరు మాత్రమే అన్ని అవరోధాలను అధిగమించి విజయ శిఖరాన్ని చేరుకుంటారు. అయితే  ఈ సమాజంలో చాలా మంది విజయాన్ని
అందుకోని వారిని, ఎదో ఒకటి సాధించని వారిని చులకనగా చూస్తుంటారు, వారికి పెద్దగా గౌరవం ఇవ్వరు, అలాగే సందర్భం దొరికితే అవమానించడానికి ఏమాత్రం వెనుకాడరు.
ఇలా చాలా మందే నిత్యం అవమాన పడుతుంటారు. కానీ దానర్థం  విజయాన్ని అందుకోని వారు అసమర్ధులు అని, ఎందుకు ఉపయోగపడరని కాదు. వారి వారి సామర్ధ్యాన్ని బట్టి ప్రయత్నించే విధానాన్ని బట్టి లక్ష్యానికి దగ్గరవుతూ ఉంటారు. ఇలాంటి వారు ఒకటి, రెండు ప్రయత్నాలకే విసుగు చెందకండి, ఒడిపోయామని నిరుత్సాహ పడకండి. ప్రయత్నం అనేది విరమించుకుంటే మిమ్మల్ని మీరు ఓటమి పాలైనట్లు అంగీకరించినట్టే, మీరు ఎందుకు అనుకున్న గమ్యాన్ని చేరుకోలేకపోయారో, మీ ప్రయత్నంలో ఉన్న లోపాలు ఏమిటో ఒకసారి సరి చూసుకోండి.
వాటిని విజయాన్ని అందుకోవడానికి అందుకు తగ్గ ప్రణాళికతో మార్పులు చేసి మళ్ళీ మీ ఈ ప్రయత్నాన్ని కొనసాగించండి విజయం తప్పకుండా  మిమ్మల్ని వరిస్తుంది. అయితే మీలోని లోటు పాట్లను గ్రహించి వాటిని సరి చేసుకోవాలి, విజయ సోపానానికి వాటిని మెట్లుగా మలుచుకుని ముందుకు సాగాలి. ఎదుటి వారి ఎత్తి పొడుపు మాటలను మీ ఆయుధాలుగా చేసుకుని ముందుకు సాగితే అంతా మంచే జరుగుతుంది. దృఢంగా సంకల్పిస్తే సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు. పై విషయాలను సరిగా అర్ధం చేసుకుని సాధన చేస్తే మీరే విన్నర్.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: