విజయం మీదే: అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదా ?

VAMSI
ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ సంతోషంగా బ్రతకాలి అనుకుంటారు. వారు కోరుకున్న అన్ని వనరులను సమకూర్చుకుని ఉండాలి అనుకుంటారు. అయితే ఇది అంత ఈజీగా జరిగే విషయం అయితే కాదు. కొన్ని సార్లు జరగొచ్చు? కొన్ని సార్లు జరగక పోవచ్చు? ..అయితే అనుకున్న జాబ్ దొరకలేదా, అంతమాత్రాన మీరు ఓడి పోయినట్లు కాదు. మీ లక్ష్యం నీరు గారిపోయింది అన్నట్లు కాదు. ఇక్కడే మీరు అర్దం చేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికీ ఒక్కో లక్ష్యం ఉండనే ఉంటుంది. అందులో ఎన్నో రకాలు ఉంటాయి.

ఒకరికి కడుపు నిండా పట్టెడన్నం తినగలిగే జీవితం సాధించడమే తన లక్ష్యం అయితే, మరొకరికి ఈ సమాజంలో అందరి కన్నా మిన్నగా కీర్తి ప్రతిష్టలతో, భోగ భాగ్యాలతో తుల తూగడం వారి లక్ష్యం అవుతుంది. మరి కొందరికి తమకు నచ్చిన ఉద్యోగాన్ని సంపాదించుకోవడమే వారి లక్ష్యం అవుతుంది. ఇలా చిన్నదైనా,  పెద్దదైనా ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని చేదించలేరు. ఖచ్చితంగా తాము అనుకున్నది అనుకున్నట్లుగా  విజయాన్ని సాధించలేకపోవచ్చు. అలాగని వారు ఓడిపోయినట్లు కాదు. అలాగే వారి ప్రయత్నం వృధా కాదు.

ఎందుకంటే ఓటమైనా గెలుపైనా సరే ముందుగా ప్రయత్నం అనేది అయితే తప్పనిసరి. అపుడే ఆ వచ్చే ఫలితం మనకు సంతృప్తిని ఇస్తుంది. అనుకున్నది సాధించాలి అని ఉండాలి మనకు వీలైనంత వరకు ఖచ్చితంగా ప్రయత్నించాలి.  కానీ ఒకవేళ అనుకున్నది సాదించలేకపోతే నిరాశ చెందకూడదు. తిరిగి ప్రయత్నించాలి లేదా మన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంచుకున్న మార్గాన్ని మరొక సారి పరీక్షించుకోవాలి. కొందరు తాము కోరుకున్న, ఆశించిన ఉద్యోగం సాదించలేకపోతే కుంగి పోకుడదు, ఇలా మన జీవితంలో ఏదైనా దొరక్కపోతే నిరాశ చెందకుండా ఎంతో ధైర్యంతో ముందుకు సాగితే మీకు విజయం దక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: