విజయం మీదే: ఈ 7 అద్భుతాలలోనే మీ విజయం?

VAMSI
మన చుట్టూ మనతో ఉన్న అద్భుతాలను చూస్తూ ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి ఇది చాలా అద్భుతమని  ఆశ్చర్యపోతుంటాం. కానీ ఈ 7 అద్భుతాలు మనతో ఉన్నవాడే జీవితంలో విజయం సాధించినట్లు లెక్క. అయితే మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు ఏవో తెలుసుకుందామా?
1 . తల్లి
మనల్ని ఈలోకానికి  పరిచయం చేసిన వ్యక్తి. మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన తల్లి ప్రతి మనిషికి మొదటి అద్భుతం. బహుశా మనకు ఈ భూమి మీదకి వచ్చామంటేనే ఒక అద్భుతం.
2 . తండ్రి
ఇక రెండవ అద్భుతం ఎవరో తెలుసా? పుట్టగానే మన తండ్రి ఎగిరి గంతేస్తాడు. మన కోసం ఏమి చేయడానికి అయినా సిద్దపడుతాడు. అప్పటి నుండి మనకోసమే బ్రతుకుతాడు. ఇది తెలియక చాలా మంది తండ్రిని తెలిసో తెలియక ఇబ్బంది పెడుతుంటారు.
3 . తోడబుట్టిన  వాళ్ళు
మనతో పుట్టిన అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు ఎప్పుడూ మనతోనే ఉండరు. కానీ  కష్టాలలో మేమున్నాం అంటూ దైర్యం చెప్పడానికి ఉంటారు. అందుకే వీరిని ఎప్పుడూ దూరం చేసుకోకండి. వీరు కూడా దేవుడిచ్చిన ఒక అద్భుతమే అనాలి.
4 . స్నేహితులు  ఇక స్నేహితులు ఆనం పదానికి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అన్ని సమయాలలోనూమానాతో ఉండి, తప్పులు ఒప్పులు అన్నీ చెబుతూ వెన్నంటే నిలిచివుంటారు. స్నేహితుడు లేని వారు మూర్ఖుడుతో సమానము.
అంతే కాకుండా మన నుండి ఏమీ ఆశించనిది ఒక్క ఫ్రెండ్ మాత్రమే. అందుకే స్నేహితులు మనకు దొరికిన నాలుగవ అద్భుతం.
5 . భార్య / భర్త ఇది దేవుడు వేసిన విచిత్రమైన మరియు పవిత్రమయిన బంధం. ఏ బంధం కోసం ప్రపంచాన్ని ఎదిరించే అంత శక్తిని దేవుడు మనకు ఇస్తాడు. అందుకే భార్యాభర్తల బంధం చాలా గొప్పది. జీవితాంతం ఎవ్వరు మనతో ఉన్నా లేకున్నా ఒక్క ఈ బంధం మాత్రమే చనిపోయే వరకు తోడు ఉంటుంది. అందుకే ఇది మనకు దక్కిన అయిదవ అద్భుతం.
6 . పిల్లలు మనము జీవితాంతం బ్రతకడానికి ఒక అర్ధం ఉండాలి. అందుకే దేవుడు పిల్లలు అనే బంధాన్ని మనకు తగిలిస్తాడు. వారి ప్రేమతో మనము జీవితాంతం బ్రతికేస్తాము. పిల్లలు లేని వారి జీవితం ఒకరకంగా నరకం అని చెప్పాలి. అందుకే వీరు మన జీవితంలోకి రాగానే మనము స్వర్గంలో ఉన్న భావన కల్గుతుంది. పిల్లలు మనకు ఆరవ అద్భుతం.
7 . మనవళ్ళు మనవరాళ్లు ఇక చివరిగా మన జీవితానికి ఏదో ఒక ముగింపు ఉండాలి. కాబట్టి ఆ దేవుడు మనకు మన బిడ్డల సంతానాన్ని ఇస్తాడు. వారిని చూసి హాయిగా చివరి రోజులను గడిపేస్తాము. ఇది ఎదవ అద్భుతం.
ఇలా మనకు మన కాలచక్రంలో ఏడు అద్భుతాలను దేవుడు మనకు అందిస్తాడు. ఇవి తెలియక మనిషి ఎప్పుడూ మనవి కానీ వాటి కోసం పరుగెడుతూ ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: