విజయం మీదే: మనిషిని అంచనా వేయడంలో విఫలమవుతున్నారా ?

VAMSI
జీవితంలో ఎంతో మందిని కలుస్తుంటాం. చాలా మందితో మనకు పరిచయం ఏర్పడుతుంది. మనుషలన్న తర్వాత ఎంతో కొంత స్వార్దం ఉంటుంది. ఎదుటి వారికంటే మనమే కాస్త గొప్పగా ఉండాలని ఆశ ఉంటుంది. కానీ అందరూ మన పతనాన్ని కోరుకుంటారు. మనం బాగుంటే చూడలేరు అనుకోవడం ఎంత పొరపాటో, మనతో ఉన్న వాళ్లంతా మన మంచినే కోరుకుంటారు అనుకోవడం కూడా అంతే పొరపాటు. కొందరు పైకి మాటలు బాగానే చెబుతారు. తేనె పూసిన కత్తిలా తీయని మాటలతో మనల్ని నమ్మిస్తారు. మనసులో ఒకటి ఉంచుకొని మరొకటి వ్యక్త పరుస్తారు. ఇలాంటి వారు మనకి చాలా ప్రమాదం. అలాంటి వారిని గుర్తించడం కాస్త కష్టమే. అయినా గుర్తించి అటువంటి వారితో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం.
కాబట్టి అందరి మాటలను విని వారిని గుడ్డిగా నమ్మేయకూడదు.  ఎవరు ఎలాంటి వారో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా మన గురించి ఏదైనా చెప్పేటప్పుడు కానీ, మనకు సలహా ఇచ్చేటప్పుడు కానీ, మన విషయం గురించి మాట్లాడేటపుడు కానీ , మనల్ని ప్రభావితం చేస్తున్నారు అన్నప్పుడు అయినా సరే వెంటనే ఇన్స్పైర్ కాకుండా కాస్త ముందు వెనక ఆలోచించాలి. ఒకటికి పది సార్లు అంచనా వేసుకుని ఆ సలహా పాటించాలా లేదా అన్నది నిర్ణయించుకోవాలి. సాధ్యమైనంత వరకు కీలకమైన విషయాల్లో మనల్ని మనమే నమ్ముకోవడం ఉత్తమం. లేదా మన సొంత వాళ్ళ సలహా తీసుకోవచ్చు.
అయితే ఈ సమాజములో చాలా వరకు అతి సులభంగా ఒకరి చేతిలో మరొకరు మోసపోతున్నారు. దీనికి కారణం మనకు ఉన్న పరిచయస్తులను సరిగ్గా అర్ధం చేసుకోకపోవడమే, వాయు మంచి వారా కాదా అని తెలుసుకోవాలి. అప్పుడే ఇలాంటి మోసాలు జరగకుండా ఉంటాయి. ఎక్కువగా పట్టణ ప్రాంతాలలో ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవగాహనా కలిగి ఉండడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: