విజయం మీదే: మీ ఫ్యామిలీలో ఇలాంటి వారు ఒక్కరున్నారా... ?

VAMSI
ఒక మనిషిగా మనము ఏదనుకుంటే అది చేయగలము. అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. కానీ ఆ మనిషి పెళ్ళై పిల్లలు పుట్టాక, ఒక కుటుంబం ఏర్పడిన తరువాత ప్రతిదీ తన కోసం ఆలోచించడానికి వీలు పడదు. ప్రతి ఒక్క విషయంలో కుటుంబ సభ్యులు అందరినీ దృష్టిలో పెట్టుకుని చేయాలి. అయితే ఇలాంటి సందర్భంలో కొంత మంది కుటుంబ నిర్వహణ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అదేదో పెద్ద బర్డెన్ లా అనుకుంటూ ఉంటారు. కానీ కుటుంబ నిర్వహణ సాఫీగా సాగిపోవాలంటే, మీ కుటుంబాన్ని బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకుని అనుసరిస్తే హ్యాపీ గా అనిపిస్తుంది.
కొందరి ఫ్యామిలీలో కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇక్కడ పెద్దగా సమస్యలు ఏమీ ఉండవు.  వచ్చినా ఆ నలుగురు కుర్వహక్కుని మాట్లాడుకుంటే తీరిపోతాయి. కానీ కొన్ని కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. కుటుంబ పెద్దకు ఇలాంటి కుటుంబాలను సరిగ్గా ముందుకు తీసుకెళ్లడం పెద్ద తలనొప్పిగా ఉంటుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ? కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిపై మీకుమన అనే భావం కలిగి ఉండాలి. అప్పుడే వారు ఏమైనా పొరపాటు చేసినా సహించగలరు, క్షమించగలరు, ఓపికగా సర్ది చెప్పగలరు. అలా కాకుండా మీ కోడలే అనుకోండి, ఎవరో బయట నుండి వచ్చింది కదా అని, తప్పులెతికి మరీ నిందించడం, మాట మాటకు ఇబ్బంది పెట్టడం చేయకూడదు.
ఒకరిపై ఒకరికి ప్రేమ అభిమానం కలిగేలా నడుచుకోవాలి. అలా మీ కుటుంబ సభ్యులందరిలో ఒక నమ్మకాన్ని కలిగించాలి.  ఎవరికైనా బాధ కలిగితే అందరూ బాధపడేలా వారిలో పరివర్తన తీసుకు రావాలి. ఒక ఇంటి పెద్దగా మీ బాధ్యత ఏమిటంటే ? ఆ ఇంటిలో రేపు మీరు ఉన్నా లేకున్నా, మీ లాగా బాధ్యత తీసుకుని కుటుంబాన్ని నడిపించే వ్యక్తులలాగా అందరినీ తయారుచేయాలి, అదే కుటుంబం పట్ల మీ యొక్క నిజమైన బాధ్యత. ఈ విషయాన్ని గుర్తుంచుకుని అమలు చేస్తే కుటంబంలో ప్రతి ఒక్కరూ మీకు జోహార్లు చెబుతారు.  ఏ ఒక్కరికీ నొప్పి కలగకుండా వారి తప్పును చూపించాలి. ఆ సమస్య వలన వారేమి కోల్పోతున్నారో తెలిసేలా చెయ్యాలి. అప్పుడే మళ్ళీ అలాంటి తప్పును మళ్ళీ వారు పునరావృతం చేయకుండా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: