ప్రముఖ ఓటీటీలో దూసుకుపోతున్న రౌడీ హీరో మూవీ...!!

murali krishna
విజయ్ దేవరకొండ 
 హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఫ్యామిలీ స్టార్'  చిత్రం డిజిటల్ ప్రీమియర్‌ లోకి వచ్చేసింది.భారీ అంచనాల మధ్య రిలీజై డిజాస్టర్ గా మిగిలిపోయిన సినిమా ది ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజైంది. అయితే తొలి షో నుంచి వచ్చిన మిక్స్‌డ్ టాక్ కారణంగా సినిమా మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రైమ్ వీడియో ఈ సినిమా శుక్రవారం, ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. థియేటర్లలో డిజాస్టర్ అయినా.. ఓటీటీలోకి అడుగు పెట్టగానే ప్రైమ్ వీడియో ఇండియాలో టాప్ ట్రెండింగ్ మూవీస్ లో నంబర్ వన్ కు దూసుకెళ్లింది.అప్పటి వరకూ టాప్ లో ఉన్న బాలీవుడ్ మూవీ తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా రెండో స్థానానికి పడిపోయింది. ఫ్యామిలీ స్టార్ ఊహించినదాని కంటే వారం ముందుగానే ఓటీటీలోకి వచ్చేయడంతో తొలి రోజు నుంచే ప్రేక్షకులు ఎగబడి చూసేశారు. దీంతో టాప్ ట్రెండింగ్ మూవీస్ లో తొలి స్థానంలోకి వచ్చింది. థియేటర్లలో ఈ మూవీని చూడని వాళ్లు ప్రైమ్ వీడియోలో చూస్తున్నారు.
తెలుగు, తమిళం భాషల్లో ఈ స్ట్రీమింగ్ అవుతుంది. ఇన్నాళ్లు ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిస్ అయినవారు ఇప్పుడు నేరుగా ఓటీటీలోనే చూసేయ్యోచ్చు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇందులో విజయ్ సరసన శ్రీలీల నటించనున్నట్లు గతంలోనే అనౌన్స్ చేశారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకుందని టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ మూవీ కోసం ప్రేమలు సూపర్ హిట్ హీరోయిన్ మమితా బైజును చిత్రయూనిట్ సంప్రదించిందని.. అందుకు మలయాళీ కుట్టి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: