బోయపాటి బాలీవుడ్ ఎంట్రీ.. మాస్ విధ్వంసానికి రంగం సిద్ధం!

Amruth kumar
తెలుగు సినిమాలో యాక్షన్ అంటే బోయపాటి తర్వాతే ఎవరైనా. గాలిలో ఎగిరే సుమోలు, తెగిపడే తలకాయలు, హీరో ఇచ్చే మాస్ ఎలివేషన్లు.. ఇవి బోయపాటి బ్రాండ్. 'భద్ర' నుంచి మొన్నటి 'స్కంద' వరకు ఆయన మేకింగ్ స్టైలే వేరు. ఇప్పుడు ఇదే స్టైల్ ని బాలీవుడ్ లో చూపించాలని ఆయన గట్టి ప్లాన్ వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం బాలీవుడ్ లో సౌత్ సినిమాలకి, ముఖ్యంగా మన మాస్ సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడి మేకర్స్ క్లాస్ సినిమాలు తీయడంలో బిజీగా ఉంటే, ఆడియన్స్ మాత్రం పక్కా లోకల్ మాస్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే సల్మాన్ ఖాన్ లేదా సన్నీ డియోల్ లాంటి స్టార్ హీరోలతో బోయపాటి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట. బోయపాటి మార్క్ యాక్షన్ కి బాలీవుడ్ స్టార్ ఇమేజ్ తోడైతే అక్కడ రికార్డులు బద్దలవ్వడం గ్యారెంటీ!



బోయపాటి నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతోందనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.బాలకృష్ణతో 'అఖండ' లాంటి భారీ హిట్ కొట్టిన తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది.గతంలో రణవీర్ సింగ్ తో బోయపాటి చర్చలు జరిపినట్లు టాక్ వచ్చింది. అలాగే కోలీవుడ్ స్టార్ సూర్యతో కూడా ఒక భారీ ప్రాజెక్ట్ లైన్లో ఉందని వినికిడి. ఒకవేళ బాలీవుడ్ హీరో దొరికితే మాత్రం అది పక్కా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుంది.బోయపాటి సినిమా అంటే బడ్జెట్ భారీగా ఉండాల్సిందే. యాక్షన్ సీన్లు, సెట్టింగుల కోసం ఆయన కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు. బాలీవుడ్ లో ఒక భారీ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టును టేకాఫ్ చేయడానికి సిద్ధంగా ఉందట. తెలుగులో తను పండించిన మాస్ ఎమోషన్స్ కి హిందీ నెటివిటీని జోడించి ఒక కొత్త రకమైన సినిమాను ఆయన ప్లాన్ చేస్తున్నారట.



హీరో ఎవరైనా, భాష ఏదైనా బోయపాటి మార్క్ మాత్రం మారదు. థియేటర్లో ఆడియన్స్ కి కిక్ ఇచ్చే సీన్లు రాయడంలో ఆయన సిద్ధహస్తుడు. బాలీవుడ్ డైరెక్టర్లు యాక్షన్ ని స్టైలిష్ గా చూపిస్తే, బోయపాటి మాత్రం రక్తం మరిగేలా చూపిస్తారు. అందుకే నార్త్ బెల్ట్ లో ఉన్న మాస్ ఆడియన్స్ కి బోయపాటి సినిమా అంటే ఒక పండగ లాంటిది.మొత్తానికి బోయపాటి శ్రీను బాలీవుడ్ ఎంట్రీపై వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోయపాటి విధ్వంసం చూడటం ఖాయం. ఆ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: