విజయం మీదే: ఆలోచనా విధానం మార్చుకో...?

VAMSI
మనము జీవితంలో భాగంగా ఎన్నో పనులతో నిత్యం బిజీగా ఉంటాము. మాములుగా తీగలో కరెంటు లేదు అని తెలిస్తే జనం బట్టలు అరేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఇదే విధంగా మిమ్మల్ని మీరు మరీ మృదుస్వభావిగా మార్చుకోకండి ఇలా ఉండటం వలన జనం మిమ్మల్ని వాడుకోవడం మొదలుపెడతారు. జీవితంలో ఎప్పుడూ అవకాశం ఇచ్చే వారిని మోసం చేయకు మోసం చేసే వారికి అవకాశం ఇవ్వకు. ఒకవేళ నువ్వు నిజంగా ఎవరినైనా వెతకాలి అనుకుంటే నీ గురించి ఆలోచించే వారిని వెతుకు నిన్ను ఉపయోగించుకోవాలని అనుకునేవారు ఎలాగో నిన్ను వెతికి మరీ పట్టుకొని ఉపయోగించుకుంటారు.
ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడితే దాన్ని గురించి పెద్దగా ఆలోచించకు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా అందరి మెప్పు పొందలేడు. అందరూ మంచివాడు అనుకునే వ్యక్తులు ఎవరూ లేరు. ఈ ప్రపంచంలో ఎవరి మాటలు అయినా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తే రెండు విధాలుగా ఆలోచించు. వ్యక్తికి ప్రాముఖ్యత ఉంటే వారు అన్న మాటల్ని పట్టించుకోకండి. ఒకవేళ వారు అన్న మాటలకు ప్రాముఖ్యత ఉంటే వ్యక్తి గురించి పట్టించుకోకండి. ఎందుకు బాధ పడతావు జనం నిన్ను అర్థం చేసుకోలేదని నువ్వు ఎప్పుడు బాధ పడాలి అంటే నిన్ను నువ్వు అర్ధం చేసుకోనప్పుడు మాత్రమే బాధపడాలి, తేడా ఒక్కొకరి ఆలోచనను బట్టి ఉంటుంది. ఒక నిచ్చెన పైకి ఎక్కడానికి ఉపయోగపడుతుంది, దిగడానికి ఉపయోగపడుతుంది.
అందుకే నువ్వు ఆలోచించే విధానాన్ని మార్చుకో అప్పుడు నీ జీవితం దానికి మారిపోతుంది. ఈరోజు గురించి ఎవరైతే ఆలోచిస్తారో వారే రాజు అవుతారు కష్టాలు దూరమైపోయిన అంతమాత్రాన మనసుకు ఎప్పుడు ప్రశాంతత అనేది ఉండదు. ఇది మీ భ్రమ మాత్రమే ఎప్పుడైనా సరే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి, అన్ని దుఃఖాలు మీ నుండి దూరం అయిపోతాయి. జీవితంలో సంతోషంగా ఉండాలి అనుకుంటున్నావా అయితే ఇతరులకు సహాయం చేయడం నేర్చుకో. వారి నుండి ఏమీ ఆశించకుండా అందరితో కలిసిపోయే కారణం లేకుండా జీవించడం నేర్చుకో ఎవరికో నీ జీవితం గురించి చూపించడానికి ప్రయత్నించకు. నీపై నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉండు ఎలాంటి సంకోచం లేకుండా మంచి జరిగినా చెడు జరిగినా అనుభవం మాత్రం మీకు తప్పక లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: