విజయం మీదే: ఏదీ శాశ్వతం కాదు...అన్నింటికీ సిద్ధంగా ఉండు...?
ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో నిజంగా లేయా జీవించాలి నేర్పిందని చెప్పవచ్చు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని కరోనా అనే ఒక ఉదాహరణ చెప్పింది. మన జీవితంలో అవసరాలు చాలా తక్కువని గుర్తించేలా చేసింది. మిగిలినవన్నీ అనవసరం. మనము చాల విషయాలు లేకుండా కూడా బ్రతకగలమని నిరూపించింది. ఏదీ కూడా తప్పని సరి కాదని అందరూ తెలుసుకున్నారు. ప్రజలు వారి దీర్ఘకాలిక అలవాట్లను మార్చుకోవలసి వచ్చింది. ప్రతి ఒక్కరికీ ప్రాణంతో ఉండడం అనేది ఒక పెద్ద లక్ష్యం. ఎవ్వరూ కూడా చనిపోవాలని కోరుకోరు. మనం జీవించి ఉన్నప్పుడు ప్రపంచాన్ని ఆస్వాదించవచ్చు. ఆరోగ్యానికి మొదటి స్థానం ఇద్దాం.
వ్యాపారంలో కొంతమంది మహమ్మారి కారణంగా చాలా సంపన్నులయ్యారు చెందారు, అదే విధంగా మరి కొందరు భారీ నష్టాలను చవిచూశారు. ఈ ప్రకృతిలో అహానికి చోటు లేదు. విజయం లేదా వైఫల్యం చాలా బాహ్య కారకాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మానవునిగా మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఈరోజు మనది అనుకుంటే, రేపు అది మనది కాదు. అందుకే అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. అప్పుడే సంతోషంగా సంతృప్తిగా మీ జీవితాన్ని అనుభవించగలరు.