విజయం మీదే: నిజానికి ప్రతి రూపం మీరే...?

VAMSI
నిజం...ఈ ఒక్క మాటను మనము దేని తోనూ పోల్చలేము. ఈ మాటను వివరించాలంటే ఏ బాషా సరి పోదు. నిజం అనేది సృష్టిలో అనంత మైనది. దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. పాత రోజుల్లో పెద్ద వారు ఒక మాట చెప్పేవారు. మీ ప్రాణం పోయినా సరే సత్యాన్నే చెప్పాలి. ఒక సారి ఆలోచించండి. ఈ ఒక్క మాటలో ఎంతటి విషయం ఉందో. మనం పలికే మాట కన్నా మన ప్రాణం కూడా ముఖ్యం కాదు. ఎప్పుడైతే నువ్వు అబ్ధం చెబుతావో అప్పుడే నువ్వు మనిషిగా చనిపోయినట్లు. పూర్వం ఇంత కఠినంగా పెంచే వారు.
ప్రస్తుతం మీరు చూస్తే ఎక్కడ చూసినా అసత్యం రాజ్యమేలుతోంది. స్వార్ధం, కుట్ర, ఈర్ష్య, అసూయ, అవినీతి మొదలైన చెడు లక్షణాలతో ప్రపంచమంతా వినాశనం వైపు దూసుకెళుతోంది. కొన్ని సార్లు భూమి పైన అసత్య పరులు ఎక్కువై పోతే ఆ భగవంతుడే ప్రకృతి వైపరీత్యాలను సృష్టించి అలాంటి వారిని లేకుండా చేస్తుంటాడు. ఈ కాలం మనుషులు నిజం మాట్లాడొద్దని, అబద్దాలు చెప్పి ఇతరులను బాధ పెట్టమని చెబుతూ ఉంటారు. అలాంటప్పుడు వారు నిజమేదో గ్రహించి, దాని వైపే వెళ్ళాలి. మన దృక్పథం పూర్తి, శ్రావ్యంగా మరియు సాపేక్షంగా ఉండాలి. సత్యానికి దూరంగా ఎప్పుడూ ఉండ కూడదు.
మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నిజాన్ని మాత్రమే వ్యక్తపరచండి. ఎలాగైతే మనము మన సంప్రదాయాలను మరియు మన తల్లితండ్రులను గురువులను గౌరవిస్తామో అదే విధంగా సత్యాన్ని గౌరవించండి. మీరు పది మందికి సత్యం యొక్క విలువను తెలియచేయండి. నిజం అనేది ఒక నమ్మకం కాదు...నిజం అనేది మనిషికి ఒక ఊపిరి లాంటిది. నిజాన్ని ఎవరు పలికినా అది నిజమే అవుతుంది. నిజం వేరు కాదు. అన్నీ తెలిసిన వారైనా, అజ్ఞాని వ్యక్తి అయినా వ్యక్తీకరించిన సత్యం నిజం.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: