మహిళ: రాత్రిళ్ళు తినకుండా పడుకుంటున్నారా?

VAMSI
ఒకప్పటి ప్రజలకు ఇప్పటి ప్రజలకు ఆరోగ్య విషయంలో చాలా మార్పులే వచ్చాయి. అప్పటి వారికి 70 ఏళ్లు దాటినా రాని బిపి, షుగర్ వంటి వ్యాధులు ఇప్పట్లో 40 ఏళ్లు దాటితే చాలు చాలా మందికి ఎన్నో దీర్ఘ కాలిక వ్యాధులు వంటివి వస్తున్నాయి. ఇంత తారతమ్యానికి కారణం మన జనరేషన్ లో జీవన శైలిలో వచ్చిన మార్పులే. ఎన్నో అధ్యయనాలు ద్వారా ఈ విషయం రుజువైంది కూడా. మన జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా తెలిసి తెలిసి చాలా పొరపాట్లు చేస్తున్నామని అవి మన ఆరోగ్యానికి చాలా కీడును చేస్తాయని హెచ్చరిస్తున్నారు చాలా మంది వైద్య నిపుణులు. ఎక్కువగా మహిళలు తెలిసి తెలిసి ఇటువంటి పొరపాట్లను చేస్తూ ఉంటారు.
ఎందుకంటే చాలా మంది స్త్రీలు పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు కూడా నిరంతరం వివిధ పనులతో బిజీగా కాలం గడుపుతుంటారు. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఇంట్లో ఆ వైపుకు ఈ వైపుకు తిరుగుతూ ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటారు. ఇలా ఇంటి పనుల్లో పడి వారి ఆరోగ్యం గురించి పూర్తిగా విస్మరిస్తుంటారు. పొద్దున తినాల్సిన బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం తినడం వంటివి చేస్తూ ఉంటారు. కొందరైతే  అలసిపోయి చాలా సార్లు అసలు ఏమి తినకుండానే ఖాళీ కడుపు తోనే నిద్రపోతుంటారు. కానీ అలా నిద్ర పోవడం ఎంత ప్రమాదమో తెలిస్తే మరో సారి అలా చేయరు.
మన మెదడుపై మానసిక ఒత్తిడి పెరుగుతుంది. గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు ఎదురవుతాయి. జీర్ణవ్యవస్థ బలహీన పడుతుంది. రాత్రి  సమయంలో భోజనం బదులు ఏదైనా ఇడ్లీ, ఉప్మా, చపాతీ 2, పాలు & బ్రెడ్, ఓట్స్ వంటి లైట్ ఫుడ్ తీసుకోండి. అది కూడా 8 లోపే తినడం మంచిది. చక్కగా జీర్ణం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: