ప‌దో త‌ర‌గ‌తితో ప్ర‌పంచ స్థాయికి... కోటిరెడ్డి ముందు చ‌దువే చిన్న‌బోయిందా ?

VUYYURU SUBHASH
`ల‌క్ష్యం స‌మున్న‌త‌మైతే.. ప‌రిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నా..  ఎంత వ్య‌తిరేకంగా ఉన్నా.. త‌ల‌వంచ‌క త‌ప్ప‌దు`- అంటారు దివంగ‌త రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లాం. అచ్చం ఇదే సూత్రం కోటిరెడ్డి గ్రూప్ అధినేత, ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జం.. స‌రిప‌ల్లి కోటిరెడ్డికి అక్ష‌రాలా స‌రిపోతుంది. ఆయ‌న పెట్టుకున్న ల‌క్ష్యం ముందు.. ల‌క్ష్య సాధ‌న‌కు ఆయ‌న చేసిన సాధ‌న ముందు.. అన్ని వ్య‌తిరేకత‌లు త‌ల వొంచాయి. అంతేకాదు.. త‌క్కువే చ‌దివాన‌నే ఆవేద‌న‌ను ప‌క్క‌న పెట్టి మ‌రీ ల‌క్ష్య సాధ‌న‌లో ఆయ‌న దూసుకుపోయిన తీరు.. న‌భూతో న‌భ‌విష్య‌తి! అని అనిపించుకుంద‌న్నా.. అతిశ‌యోక్తి కాదు.

70 కోట్ల మందికి సేవ‌లు
ఏపీలోని కృష్ణాజిల్లాలో ఉన్న గుడివాడ‌లో మారుమూల ప‌ల్లెటూరు అయిన జ‌నార్థ‌న‌పురంకు చెందిన కోటిరెడ్డి స‌రిప‌ల్లి.. చాలా త‌క్కువ చ‌దువుకున్నా రు. కానీ, ఇప్పుడు ఆయ‌న  ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి పొందిన కోటి గ్రూప్ ఆఫ్ వెంచెర్స్ అధినేతగా ఉన్నారు. ఎంత చ‌దివామ న్న‌దికాదు.. ఎంత‌గా దూసుకు పోయామ‌న్న‌దే ముఖ్య‌మ‌నే సూత్రాన్ని ఆయ‌న న‌మ్ముకున్నారు. ప్ర‌స్తుతం 162 దేశాల్లో కోటి రెడ్డి గ్రూప్ టెక్నాల‌జీ ప‌రంగా సేవ‌లు విస్తృతం చేసింది. దీంతో 70 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు ఈ సేవ‌లు అందుతు న్నాయి. అంతేకాదు, అత్యంత త‌క్కువ ధ‌ర‌ల‌కే ఆయా సేవ‌లు అందుతున్నాయి. ఈ మొత్తం కృషి వెనుక కోటిరెడ్డి చ‌దువు క‌న్నా.. ఆశ‌యం.. ల‌క్ష్యం ఉండ‌డం గ‌మ‌నార్హం.
ఒక చిన్న అడుగే..
ల‌క్ష్యం ఉంది. కానీ, సాధ‌న ఎలా ? ఒక‌ప్పుడు కోటిరెడ్డి మెద‌డును తొలిచేసిన ప్ర‌శ్న ఇది. పైగా ఆయ‌న చ‌దివింది కూడా ప‌దో త‌ర‌గ‌తి మాత్ర‌మే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న హైద‌రాబాద్ చేరుకుని మైక్రోసాఫ్ట్‌లో అడుగు పెట్టారు. ఇక్క‌డ ఆయ‌న అనేక వ్య‌తిరేక‌త‌లు వ‌చ్చాయి. త‌న‌లోని లోపాలను ఎత్తి చూపేవారు పెరిగారు. అయినా.. ఆ వ్య‌తిరేక‌త‌ల్లోనూ సానుకూల‌తలు వెతుక్కున్నారు. వాటిని అభివృద్ధికి ఆల‌వాలంగా మార్చుకున్నారు. లోపాల‌ను స‌రిచేసుకున్నారు. సంస్థ ఎదుగుద‌ల‌లో త‌న వంతు పాత్ర‌ను పోషించారు.
అనంత‌రం త‌నే సొంత‌గా కంపెనీని ప్రారంభించారు. దీనిని విస్త‌రించే ప్ర‌య‌త్నంలో ఎదురైన క‌ష్టాల‌ను కూడా ఎదుర్కొని ధీటుగా నిల‌బ‌డి రాటుదేలారు. ప‌దుల సంఖ్య‌లో కంపెనీలు పెట్టి  ఈ రోజు వంద‌ల మందికి ఉద్యోగాలు క‌ల్పించారు. ఇలా.. మొత్తంగా త‌న‌దైన ల‌క్ష్యం దిశ‌గా వేసిన అడుగులు చ‌దువుతో నిమిత్తం లేకుండా స‌క్సెస్ దిశ‌గా సాగేలా చేశాయి. ప్ర‌పంచంలోనే ఒక ఐకాన్‌గా కోటిరెడ్డిని నిల‌బెట్టాయి. అందుకే.. కోటిరెడ్డి ల‌క్ష్యం ముందు.. చ‌దువే చిన్న‌బోయిందా! అని అన‌డంలో అతిశ‌యోక్తి ఏమాత్రం లేదు. మ‌నిషి ఎదుగుద‌ల‌కు చ‌దువే ముఖ్యం కాద‌ని.. ప్ర‌ణాళిక‌, పోరాటం, ఆశ‌య సాధ‌నే ముఖ్య‌మ‌నేందుకు కోటిరెడ్డే ఉదాహ‌ర‌ణ‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: