మాస్ మహారాజా రవితేజ తాజాగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈగల్ అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ మూవీ లో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. ఇకపోతే ప్రస్తుతం రవితేజ , హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.
మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి కానుంది. ఇకపోతే ఈ మూవీ సెట్స్ పై ఉండగానే రవితేజ , అనుదీప్ కేవీ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. మిస్టర్ బచ్చన్ మూవీ షూటింగ్ పూర్తి కాగానే రవితేజ , అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమా కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో రవితేజ క్యారెక్టర్ కు సంబంధించిన ఓ క్రేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రవితేజ ఈ మూవీ లో దొంగగాను , పోలీస్ గానూ రెండు పాత్రలోనూ కనిపించబోతున్నట్లు ... ఈ రెండు పాత్రలోను తనదైన వేరియేషన్స్ తో రవితేజ కామెడీని పండించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే గతంలో రవితేజ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ విక్రమార్కుడు లో కూడా ఒక పాత్రలో రవితేజ దొంగ గాను , మరొక పాత్రలో పోలీస్ ఆఫీసర్ పాత్రలోను నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక రవితేజ దొంగ పాత్రలో నటించిన సినిమాలు అనేకం ఉన్నాయి. అందులో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి.