
సునీతా విలియమ్స్ ప్రేమ కథ గురించి తెలుసా..?
సునీతా పూర్వికులు గుజరాత్ ప్రాంతానికి చెందిన వారట. ఈమె తండ్రి న్యూరో అటానమిస్టుగా ఉన్నప్పటికీ వీరు అమెరికాలో స్థిరపడిపోయారు. ఇక సునీత తల్లి ఊర్సెలిన్ బోనీ పాండ్యా ఈమె అమెరికాకు వలస వెళ్లడం జరిగిందట. దీపక్, బోనికి ముగ్గురు సంతానం అవ్వగా సునీతా చిన్నదట. సునీతకు అన్నయ్య జే. థామస్, అక్క దీనా కూడా ఉన్నారట. సునీత చదువు మొత్తం అమెరికాలోనే కొనసాగింది. ఈమె చదువు పూర్తి అయిన తర్వాత అమెరికా నౌకా దళంలో ఉద్యోగిగా చేరారట.
అలా 1987 లో నావెల్ అకాడమీ లో ఉన్న సమయంలో మైఖేల్ జే విలియన్స్ తో ఈమెకు పరిచయం ఏర్పడి ఆ పరిచయం స్నేహంగా ప్రేమగా కూడా మారిందట. వీరిద్దరూ మొదట పైలెట్స్ గా నేవీ హెల్ప్ కార్టర్లు నడుపుతూ ఉండేవారట. అలా కొన్నేళ్లు సహజీవనం చేసి 20 ఏళ్ల క్రితం వివాహ బంధంతో ఒకటయ్యారు. అయితే ఇక్కడ మైకేల్ కూడా హిందూ మతాన్ని ఆచరించారట. అయితే వీరికి పిల్లలు లేరని ఒక పాపను దత్తకు తీసుకోవాలని ఉందంటే ఇటీవల భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ఈ దంపతులు తెలియజేశారు. సునీతా కు భారత్ అంటే చాలా ఇష్టమని ఎన్నో సందర్భాలలో తెలిపింది. 2006లో మొదటిసారి అంతరిక్షానికి వెళ్లినప్పుడు ఈమె భగవద్గీతను కూడా తీసుకువెళ్లిందట. ఇక 2012లో వెళ్లినప్పుడు ఒక ముద్ర, సమోసాలను కూడా తీసుకువెళ్లిందట.. అలాగే ఒక గణేశుడు విగ్రహాన్ని కూడా ఎప్పుడు ఈమె పక్కనే ఉండేలా చూసుకుంటుందట.