దీపావళి: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం గుడ్ న్యూస్.. ఎంత తగ్గింపంటే..?
నిజానికి పెట్రోల్ ,డీజిల్ ధరలు అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలపైన ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు. క్రూడాయిల్ ధరలు కూడా భారీగా తగ్గడంతో చమురు సంస్థల వద్ద భారీగానే నిలువ ఉండడంతో కొన్ని వారాల క్రితం బ్యారెల్ చమురు ధర 80 డాలర్లకు ఉండగా ప్రస్తుతం 70 డాలర్లకు పడిపోయినట్లు సమాచారం. అందుకే గత నెల రోజుల నుంచి అంతర్జాతీయంగా మార్కెట్లో కూడా క్రూడాయిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయట. దీంతో ఇండియాలో కూడా డీజిల్, పెట్రోలు పైన రూ 3 రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పెట్రోల్ ,డీజిల్ పైన కూడా రేటు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతర్జాతీయ రేటుతో పోలిస్తే.. పెట్రోల్ పైన రూ.15 రూపాయలు డీజిల్ పైన రూ .12 రూపాయలు వ్యత్యాసం ఉంటుంది అంటూ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గిరీష్ కుమార్ తెలియజేశారు. అంతర్జాతీయ రేట్లను ఉద్దేశించి దేశవ్యాప్తంగా ఇంధన ధరలను సవరించాలని విషయం పైన 2021 నుంచి పోరాడుతూనే ఉన్న చమురు సంస్థలు ఏమాత్రం సహకరించడం లేదట. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో 100 రూపాయలకు పైగా రేట్లు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో వంద రూపాయలని కూడా దాటేశాయి. మరి దీపావళి రోజున కేంద్రం ఏదైనా గుడ్ న్యూస్ ఉంటుందో లేదో చూడాలి మరి.